Ditva Cyclone | తుపాను ప్రభావిత జిల్లాల అధికారులు అలెర్టుగా ఉండాలి : ఏపీ సర్కార్ ఆదేశాలు
Ditva Cyclone | దిత్వా తుపాను ప్రభావం పడే జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.
అమరావతి : దిత్వా తుపాను (Ditva Cyclone ) ప్రభావం పడే జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపుడి అనిత ( Minister Anita ) అన్నమయ్య, నెల్లూరు. కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్( Video Conference) నిర్వహించారు.
ప్రజలను అలెర్టు చేస్తూ ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయం కోసం కంట్రోల్ రూమ్‌కు వచ్చే కాల్స్‌కు వెంటనే స్పందించాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు, ఈదురుగాలులతో విరిగిపడే చెట్లు, కొమ్మలు, హోర్డింగ్స్‌ను వెంటనే తొలగించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
కాగా దిత్వా ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు , బాపట్ల, కడప , అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు విపత్తుల శాఖ ఆరెంజ్ అలెర్ట్, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. దక్షిణకోస్తా పోర్టుల్లో మూడో నంబర్, ఉత్తరకోస్తా పోర్టులో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావం కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

