రెండు జిల్లాల్లో పెట్రోల్ ధరను తగ్గించిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పటికే 11 జిల్లాల్లో సెంచరీ క్రాస్
రెండు జిల్లాల్లో పెట్రోల్ ధర తగ్గింపు | విశాఖ, కడప జిల్లాల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ ధరను స్వల్పంగా తగ్గించింది. విశాఖలో లీటర్‌పై రూ. 19 పైసలు, కడపలో రూ. 17 పైసలు తగ్గించడంతో ఈ రెండు జిల్లాల్లో లీటర్ ధర వందకు దిగువకు చేరింది.

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధర వాహనదారులకు గుబులు పుట్టిస్తున్నది. రెండు జిల్లాల్లో మినహా మిగిలిన 11 జిల్లాల్లో లీటర్ ధర ఇప్పటికే సెంచరీ మార్కును దాటేసింది. శుక్రవారం విశాఖ, కడప జిల్లాల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్వల్పంగా ధరను తగ్గించింది. విశాఖలో లీటర్‌పై రూ. 19 పైసలు, కడపలో రూ. 17 పైసలు తగ్గించడంతో ఈ రెండు జిల్లాల్లో లీటర్ ధర వందకు దిగువకు చేరింది.
ఆయా జిల్లాల్లో ధరలు ఇలా..
అనంతపురం జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 100.80 పైసలు, చిత్తూర్లో రూ.101, తూర్పుగోదావరిలో రూ.100.23, పశ్చిమగోదావరిలో రూ.101.23, కృష్ణా జిల్లాలో రూ. 100.70, గుంటూరులో రూ.100.89, కర్నూల్లో రూ.101.03, నెల్లూరులో రూ.100.30, విజయవాడలో రూ.100.89, ప్రకాశం జిల్లాలో రూ.100.67, శ్రీకాకుళంలో రూ.100.68, విజయనగరంలో రూ.100.04, విశాఖలో లీటర్ పెట్రోల్ రూ. 99.90, కడపలో లీటర్ ధర రూ. 99.93గా ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

