అమరావతి : దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) మరణం పట్ల ఏపీ కేబినేట్ (AP Cabinet ) సంతాపం వ్యక్తం చేసింది. గురువారం విజయవాడలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి వర్గ సహచరులు హాజరయ్యారు.
కేబినెట్ భేటీకి ముందు రతన్ టాటా చిత్రపటానికి సీఎం, మంత్రులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రతన్ టాటా మృతికి సంతాపం ప్రకటించి, గౌరవసూచకంగా ఇతర అంశాలేవీ చర్చించకూడదని మంత్రివర్గం నిర్ణయించింది. అజెండా అంశాలపై చర్చను వాయిదా వేసింది . సీఎం చంద్రబాబు, తనయుడు, మంత్రి లోకేష్ ఇద్దరు కలిసి ముంబాయికి వెళ్లి రతన్ టాటా పార్థివదేహాం వద్ద నివాళి అర్పించనున్నారు.