Taneti Vanita | కోనసీమకు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఒక జిల్లాకు బీఆర్ అంబేద్కర్ పేరు పెడితే వ్యతిరేకించడం బాధాకరం అని మంగళవారం చెప్పారు. జిల్లా ప్రజల అభీష్టానికి అనుగుణంగానే జిల్లా పేరు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చినట్లు పేర్కొన్నారు.
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లపై విచారణ తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని తానేటి వనిత స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నిస్తున్నారని మండి పడ్డారు. పోలీసులపై దాడి చేయడాన్ని ఖండించారు. 20 మంది పోలసులపై రాళ్లతో దాడి చేసి గాయ పరిచారన్నారు. ఒక ప్రైవేట్ పాఠశాల బస్సును కూడా తగుల బెట్టారని, పోలీసు జీపుపైనా రాళ్లతో దాడి చేశారని చెప్పారు.