అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ (YCP) పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఆ పార్టీకి చెందిన నాయకులు వరుస రాజీనామాలు చేస్తుండడంతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తరువాత పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి టీడీపీ, జనసేన, బీజేపీలో చేరారు.
తాజాగా విశాఖపట్నంలోని విశాఖ డెయిరీ చైర్మన్ (Visakha dairy chairman ) ఆడారి ఆనంద్‌కుమార్‌తో పాటు పలువురు డైరెక్టర్లు (Directors ) వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. డైరక్టర్లు శీరంరెడ్డి సూర్యనారాయణ, దాడి పవన్‌కుమార్, వరాహ వెంకట శంకర్రావు, కోళ్ల కాటమయ్య, పిల్లా రమా కుమారి, చిటికెల రాజకుమారి, సుందరపు ఈశ్వర్, రెడ్డి రామకృష్ణ, పరదేశి గంగధర్ రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. రాజీనామా పత్రాలను వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపించారు.
వైసీపీ నుంచి పోటీ చేసి ఎంపీలుగా గెలిచిన ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ తమ పదవులకు రాజీనామా చేసి టీడీపీ, బీజేపీలో చేరారు. వారి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు ఇటీవల ఎన్నికల సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ తరుఫున కండువా కప్పుకున్న ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు మరోసారి ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నియ్యారు.