Tharigonda Brahmotsavams | 16 నుంచి తరిగొండ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
Tharigonda Brahmotsavams | టీటీడీ ఆధ్వర్యంలోని అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం తరిగొండలో గల లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 16 నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి.
తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలోని అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం తరిగొండలో గల లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు(Tharigonda Brahmotsavams ) మార్చి 16 నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా రేపు సాయంత్రం ఉత్సవాలకు అంకురార్పణ జరుగనుందని టీటీడీ అధికారులు వివరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి రోజు ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తామని వెల్లడించారు.
21న రాత్రి లక్ష్మీనరసింహస్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. కల్యాణంలో పాల్గొనే గృహస్తులు రూ. 300 చెల్లించి పాల్గొనవచ్చని అన్నారు. 25న ఉదయం స్నపనతిరుమంజనం, సాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం కార్యక్రమం జరుగుతుందని వివరించారు.
తిరుమల హుండీ ఆదాయం రూ. 3.55 కోట్లు
తిరుమల : తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 67,832 మంది భక్తులు దర్శించుకోగా 25,636 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ . 3.55 కోట్లు వచ్చిందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 10 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

