విశాఖలో అంగన్వాడీల ఆందోళన, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్
తమ డిమాండ్లను సాధించుకునేందుకు అంగన్వాడీలు విశాఖలో భారీ ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ...
విశాఖలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. తమ డిమాండ్లను సాధించుకునేందుకు అంగన్వాడీలు భారీ ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు అంగన్వాడీలు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, అంగన్వాడీల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకున్నది. తమ డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు తమకు అనుమతి ఇవ్వాల్సిందేనంటూ అంగన్వాడీలు బైఠాయించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని తప్పించారు.
డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు కదం తొక్కారు. విశాఖ కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అంగన్వాడీలను నిలువరించేందుకు పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో.. కలెక్టరేట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని దాటుకుని కొందరు గోడలు దూకి కలెక్టరేట్లోకి ప్రవేశించారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.26 వేల ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.
అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో రావడం.. వారిని అడ్డుకునేంత సంఖ్యలో మహిళా పోలీసులు లేకపోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది. మగ పోలీసులు కూడా రంగంలోకి దిగాల్సివచ్చింది. భారీగా అంగన్వాడీలు వస్తున్నారనేది పోలీసులు ముందస్తుగా గుర్తించకపోవడం వల్ల ఇబ్బందికరంగా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

