జగన్ అక్రమాస్తుల కేసు : విజయసాయి, జగతి పబ్లికేషన్స్ పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్
హైకోర్టు తీర్పు రిజర్వ్ | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల్లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్ల పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది.

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల్లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్ల పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం ఈ రెండు పిటిషన్లపై కోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి కోర్టుకు వాదనలు వినిపించారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులను మొదట విచారణ జరపాలన్న సీబీఐ, ఈడీ కోర్టు ఉత్తర్వులు కొట్టివేయాలని నిరంజన్ రెడ్డి పిటిషనర్ల తరఫున కోర్టును అభ్యర్థించారు.
సీబీఐ కేసుల ఆధారంగానే ఈడీ విచారణ జరిగింది. ఈ క్రమంలో మొదట సీబీఐ కేసులు లేదా రెండూ సమాంతరంగా విచారణ జరపాలని కోరారు. సీబీఐ, ఈడీ కేసులు రెండూ వేర్వేరని కోర్టుకు తెలిపారు. ప్రధాన కేసుతో సంబంధం లేకుండా మనీలాండరింగ్ అభియోగాలపై విచారణ జరపవచ్చన్నారు. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ ఛార్జ్షీట్లపై విచారణ జరపాలని అదనపు సొలిసిటర్ జనరల్ న్యాయస్థానాన్ని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

