YS Jagan | ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే వైసీపీ శ్రేణులపై దాడులు.. వైఎస్ జగన్ ఫైర్
YS Jagan | ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ రెండు నెలల కాలంలోనే ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదని అన్నారు.
YS Jagan | ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ రెండు నెలల కాలంలోనే ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదని అన్నారు. ఈ మేరకు టీడీపీ కూటమి ప్రభుత్వంపై జగన్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో తమపార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయని జగన్ అన్నారు. నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి జరిగిన హత్య, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటనలు వీటికి నిదర్శనాలే అని పేర్కొన్నారు. ప్రజలకిచ్చిన హామీలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోలేకపోవడంతో ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఎవరూ ప్రశ్నించకూడదని, రోడ్లపైకి రాకూడదని ప్రజలను, వైసీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ దారుణాల బాధితులకు అండగా ఉంటూ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ట్వీట్‌కు #SaveAPFromTDP హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.
నంద్యాల జిల్లాలో శనివారం రాత్రి వైసీపీ నాయకుడిని దారుణంగా హత్య చేశారు. మహానంది మండల పరిధిలోని సీతారామపురంలో వైసీపీ నేత సుబ్బరాయుడిని కొంతమంది దుండగులు రాళ్లతో అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు. దాదాపు 40 మంది దుండగులు దాడి చేసి హతమార్చినట్లుగా తెలుస్తోంది. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులే తన భర్తను చంపేశారని సుబ్బరాయుడు భార్య ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై వైఎస్ జగన్ సీరియస్‌గా స్పందించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

