హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. 897 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566లకు ఫిబ్రవరి 25 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు.
ఈ నెల 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నూతన సిలబస్, నూతన నియామక ప్రక్రియలో పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.