ఆనందయ్య చుక్కల మందుతో దుష్పరిణామాలు లేవు.. హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
ఆనందయ్య చుక్కల మందు | కరోనాకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన కంట్లో వేసే చుక్కుల మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది.

అమరావతి : కరోనాకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన కంట్లో వేసే చుక్కుల మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది. ప్యాకింగ్, స్టోరేజ్‌కు కనీసం 3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని కోర్టుకు తెలిపింది. మూడు నెలల తర్వాతే పంపిణీ చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఆనందయ్య కంటి చుక్కల మందుపై గురువారం హైకోర్టు విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కోర్టుకు తన వాదనలు వినిపించింది.
జాతీయ ఆయుర్వేద పరిశోధన మండలి నుంచి ఆనందయ్య కంటి చుక్కల మందుపై నివేదిక అందిందని స్పష్టం చేసింది. భోజన విరామం దృష్ట్యా విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. కంట్లో వేసే చుక్కల మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆనందయ్య ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. చుక్కల మందు మినహా మిగిలిన మందుల పంపిణీ గత సోమవారం ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కంట్లో వేసే మంందుపై జాతీయ ఆయుర్వేద పరిశోధన మండలి నివేదిక రావాల్సి ఉన్నందున రెండు వారాల సమయం కావాలని కోర్టును ప్రభుత్వం అభ్యర్థించిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

