ఏపీలో మరో కర్మాగారంలో ప్రమాదం ..ఇద్దరు మృతి
Accident | ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో ఉన్న కర్మాగారాల్లో తరుచు ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయి. రెండు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కర్మాగారాల్లో తరుచు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో జరిగిన విషవాయువు లీక్ ఘటనలో సుమారు వంద మంది కార్మికులు అస్వస్థతను మరచిపోకముందే తూర్పు గోదావరి జిల్లాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది.
జిల్లాలోని దేవరపల్లి మండలం బందపురం సమీపంలో ఉన్న పరమేశ్వర బయోటెక్ కర్మాగారం లో ఇవాళ ప్రమాదం జరిగింది. ఇద్దరు కార్మికులకు ఆక్సిజన్ అందక మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కర్మాగారంలోని బాయిలర్లో దిగి శుభ్రం చేస్తుండగా అస్వస్థతకు గురై చనిపోయారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సంబంధిత యాజమాన్యాన్ని అడిగి తెలుసుకుంటున్నారు.
అచ్యుతాపురం ఘటనపై ఏపీ సీఎం జగన్ తీవ్రంగా స్పందించి కర్మాగారాల్లో వరుస ప్రమాదాలపై సీరియస్ అయ్యారు. కర్మాగారాల్లో సేఫ్టీ మేసర్స్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన 24 గంటల్లోనే తూర్పు గోదావరి జిల్లాలో మరో ప్రమాదం జరగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతుంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

