Srisailam Temple | శ్రావణమాసం సందర్భంగా శ్రీశైలంలో ఆర్జిత అభిషేకాలు రద్దు
Srisailam Temple | ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 15 వరకు నిజ శ్రావణమాసం (Shravanamasam ) సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో ఆర్జిత, సామూహిక అభిషేకాలను నిర్దేశిత తేదీల్లో నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ( EO ) వెల్లడించారు.
శ్రీశైలం : ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 15 వరకు నిజ శ్రావణమాసం (Shravanamasam ) సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో ఆర్జిత, సామూహిక అభిషేకాలను నిర్దేశిత తేదీల్లో నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ( EO ) వెల్లడించారు. అధిక శ్రావణంలోనూ అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చే అవకాశముందని అన్నారు. భారీ వర్షాల కారణంగా వచ్చే వరద నీటిని దిగువ ప్రాంతాలకు పంపేందుకు ఆగస్టులో శ్రీశైలం ఆనకట్ట (Srisailam Gates) గేట్లను తెరిచే అవకాశం ఉండడంతో సేవల నిలుపుదల నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు.
ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 15 వరకు వచ్చే శని, ఆది, సోమవారాలతో పాటు , స్వాతంత్య్ర దినోత్సవం, వరలక్ష్మివ్రతం, శ్రీకృష్ణాష్టమి రోజున అభిషేకాలు, సామూహిక అభిషేకాలను నిలుపుదల చేసినట్లు వివరించారు. ఈ రోజుల్లో మూడు విడతల వారిగా భక్తులకు అలంకార దర్శనం (Alankara Darsan) , స్పర్శ (Sparsha Darsan) దర్శనం కల్పిస్తున్నామని వెల్లడించారు.
శ్రీ స్వామివారి స్పర్శదర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా పొందవలసి ఉంటుందని అన్నారు. ఇప్పటికే ఆగస్టు మాసపు టికెట్ల కోటాను ఇప్పటికే దేవస్థానం వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు . సెప్టెంబర్ మాసపు టికెట్ల కోటాను ఆగస్టు 25 వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని వివరించారు. నిర్ధిష్ట రోజుల్లో కాకుండా మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉచిత స్పర్శదర్శనం యథావిధిగా కొనసాగుతుందన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

