Wind turbine | విండ్ టర్బైన్‌తో తాగునీరు, కరెంటు ఉత్పత్తి.. పేదల కష్టాలు తీర్చేందుకు అనంతపురం యువకుడి అద్భుత ఆవిష్కరణ
గ్రామీణుల వెతలను అర్థం చేసుకున్న ఓ యువకుడు ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. నీరు, కరెంటు కష్టాలకు చెక్‌పెట్టాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన మధు వజ్రకరూర్ అనే యువకుడు తాగునీరు, కరెంటును ఉత్పత్తి చేసే గాలిమర (విండ్ టర్బైన్)ను ఆవిష్కరించారు.
Wind turbine | అనంతపురం, సెప్టెంబర్ 10: గ్రామీణుల వెతలను అర్థం చేసుకున్న ఓ యువకుడు ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. నీరు, కరెంటు కష్టాలకు చెక్‌పెట్టాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన మధు వజ్రకరూర్ అనే యువకుడు తాగునీరు, కరెంటును ఉత్పత్తి చేసే గాలిమర (విండ్ టర్బైన్)ను ఆవిష్కరించారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆయనకు కొత్త ఆవిష్కరణలపై చిన్నప్పటి నుంచి ఆసక్తి ఎక్కువ.
పేదలు పడుతున్న తాగునీరు, కరెంటు కష్టాలను తీర్చాలని 16 ఏండ్లుగా కృషి చేస్తున్న ఆయన తాజాగా విజయవంతం అయ్యారు. 2020లో ఆయన అభివృద్ధి చేసిన గాలి మర 30 కిలో వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి సుమారు 25 ఇండ్ల కరెంటు కష్టాలను తీరుస్తున్నది. అదే సమయంలో స్వచ్ఛమైన తాగునీరు అందిస్తూ ప్రజల దాహార్తిని తీరుస్తున్నది. రోజూ 80-100 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు దీని ద్వారా అందుతున్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

