Marigold cultivation | బంతి సాగుతో సిరులు మీ సొంతం.. ఇలా..!
Marigold cultivation | బంతి పూలు అన్ని ప్రాంతాల్లో, అన్ని కాలాల్లో సాగు చేసుకోవచ్చు. ఆకర్షణీయమైన రంగులు, సైజు, ఆకారాలతో పాటు ఎక్కువ కాలం నిలువ ఉండే స్వభావం ఉన్నందువల్ల వ్యాపార పరంగా మంచి గిరాకీ...
Marigold cultivation | బంతి పూలు.. అన్ని పండుగలకు మన ఇంటికి అందాన్నిచ్చేవి. చాలా రోజులపాటు వాడిపోకుండా ఉండటమే కాకుండా ఇంటికి శోభనిస్తాయి. అందుకని ప్రతీ పర్వదినంలో, ఫంక్షన్లో బంతిపూలు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి. ఈ పూలను అన్ని ప్రాంతాల్లో, అన్ని కాలాల్లో సాగు చేసుకోవచ్చు. ఆకర్షణీయమైన రంగులు, సైజు, ఆకారాలతో పాటు ఎక్కువ కాలం నిలువ ఉండే స్వభావం ఉన్నందువల్ల వ్యాపార పరంగా మంచి గిరాకీ ఉంటుంది.
వాతావరణ పరిస్ధితులను బట్టి జులై మొదటి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు నాటుకుంటే అక్టోబరు నుండి ఏప్రిల్ వరకు పూలదిగుబడి వస్తుంది. పూల సరఫరాను అక్టోబరు నుంచి ఏప్రిల్ వరకు చేయవచ్చు. సెప్టెంబరులో నాటిన పంట నుంచి దిగుబడి బాగా వస్తుంది. వానాకాలంలో పూలపై వర్షం పడటం, వేసవిలో హెచ్చు ఉష్ణోగ్రతల కారణంగా పూల నాణ్యత దెబ్బతింటుంది.
విత్తన సేకరణ
ఆఫ్రికన్ మేరీ గోల్డ్ రకానికి సంబంధించి మొక్కలు ఎత్తుగా పెరిగి పెద్ద సైజులో పూలు పూస్తాయి. దీనిలో ఆఫ్రికన్ జెయింట్ ఆరెంజ్ డబుల్, ఆఫ్రికన్ ఎల్లో జెయింట్ డబుల్, క్రాక్ జాక్, గోల్డెన్ ఏజ్ రకాలు అనువైనవి. ఫ్రెంచ్ మేరీ గోల్డ్ ఇది పూల కుండీల్లో పెంచే పొట్టి సైజు రకం. దీనిలో రెడ్ బ్రోకెడ్, రెస్పిన్ రెడ్, బట్టర్ స్కాబ్, వాలెన్షియా రకాలు అనువైనవి. బంతిని మిరప, పత్తి పంటల్లో రక్షక పంటగా పెంచుకోవచ్చు. బంతిని విత్తనం ద్వారా, కత్తిరింపు ద్వారా కూడా చేపట్టవచ్చు. ఎకరాకు నారు పెంచటానికి 800 గ్రాముల విత్తనాలు అవసరం అవుతాయి.
ఎరువులు
చివరి దుక్కిలో ఎకరానికి 20 టన్నుల చొప్పున బాగా చిలికిన పశువుల ఎరువు వేసి కలియ దున్నాలి. దీనితో బాటుగా 20-40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు వేయాలి. నాటిన 37 రోజులకి 20-40 కిలోల నత్రజని పైపాటుగా వేసి నీరు పెట్టాలి.
నీటి యాజమాన్యం
నాటిన 55-60 రోజుల వరకు అంటే శాఖీయ పెరుగుదల సమయంలోను పూత దశలోను నేలలో తగినంత తేమ వుండేలా చూడాలి. ఏ దశలోనైనా మొక్కలు నీటి ఎద్దడికి గురైతే, పెరుగుదల మరియు పూల దిగుబడి తగుతుంది.
సస్యరక్షణ
నారుకుళ్లు తెగులు : నేలలో తేమ ఎక్కువగా ఉండి వెచ్చని వాతావరణంలో ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. మొలకెత్తిన నారు మొక్కల కాండం కుళ్లి చనిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి 2గ్రా కాప్టాన్ లేదా 1.5గ్రా కార్బండిజం కలిపిన మందు ద్రావణంలో నారుమడిని తడిపి నివారించవచ్చు.
మొగ్గతొలిచే పురుగు : లార్వాలు పూ మొగ్గలను తొలుస్తాయి. దీంతో పూ మొగ్గలు విచ్చుకోవు. పూల దిగుబడి బాగా తగ్గుతుంది. నివారణకు కార్బరిల్ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పేను పురుగు : పెద్ద, పిల్ల పురుగులు పూ మొగ్గల్ని ఆశించి నష్టపరుస్తాయి. నివారణకు లీటరు నీటికి మలాథియాన్ 2మి.లీ లేదా డైమిథోయేట్ 2.మి.లీ 15 రోజుల వ్యవధిలో పిచికారి చేసి నివారించవచ్చు.
తామర పురుగులు : పిల్ల, తల్లి పురుగులు ఆకులు, పూల నుండి రసాన్ని పీలుస్తాయి. ఆకులు మీద తెల్లని మచ్చలు కనిపిస్తాయి. ఇవి ఆశించిన పూ మొగ్గలు గోధుమ రంగు మారి ఎండిపోతాయి. నివారణకు డైమిథోయేట్ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పూల కోత
బాగా విచ్చుకున్న పువ్వులను కోయాలి. ఉదయం, సాయంత్రం సమయాల్లోనే పూలు కోయడం శ్రేయస్కరం. కోతకు ముందు నీటి తడి ఇస్తే పూలు కోత తర్వాత ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉంటాయి. సకాలంలో పూలకోతలు చేస్తూ ఉంటే పూల దిగుబడి పెరుగుతుంది. సాధారణంగా ఎకరాకు 4 – 5 టన్నుల దిగుబడి వస్తుంది.
Read Today's Latest Agriculture News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

