Drumstick cultivation | మునగలో ఎరువులు, పురుగుల యాజమాన్యం
Drumstick cultivation | మునగ సాగులో రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. దీనివల్ల పెట్టుబడులు, శ్రమ తగ్గడమే కాకుండా అధిక దిగుబడులను సాధించవచ్చు. రైతులు మునగ విత్తనాలు నాటి నుంచి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ...
పెరటితోటల్లో గానీ, మిద్దె తోటల్లోగానీ మునగ చెట్టును తప్పనిసరిగా పెంచుకోవడం మనకెంతో ఆరోగ్యాన్నిస్తుంది. తోటలో మునగ చెట్టు ఉంటే ఒక కాయగూర, ఒక ఆకుకూర చెట్టు ఉన్నట్లుగానే లెక్క. మునగ కాయలతోపాటు ఆకును కూడా వాడుకోవచ్చు.
ఈ చెట్లు సులభంగా, తొందరగా కాపునకు వస్తుంది. మునగ చెట్టును గుబురుగా పెంచాలి. ప్రతి అడుగు ఎత్తు పెరిగినప్పుడల్లా.. కొమ్మల చివరలను తుంచాలి. తుంచిన చోట, తిరిగి రెండు చివుళ్లు వస్తాయి. దానివల్ల చెట్టు ఎక్కువ కొమ్మలతో గుబురుగా పెరుగుతుంది. ఆకు కోసి కూర వండుకోవచ్చు. లేనట్లయితే, చెట్టు నిటారుగా పెరుగుతుంది. విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. మొక్క నాటిన లేదా విత్తనం వేసిన తర్వాత కనీసం ఆరేడు నెలలు పూతను తుంచేయడంవల్ల చెట్టు బలంగా ఎదుగుతుంది.
మునగ సాగు చేస్తే అధిక లాభాలని స్వల్పకాలంలో పొందొచ్చు. ఏ రకమైన నేల అయినా సరే ఈ పంటను సాగు చేయడానికి బాగుంటుంది. మునగ సాగులో రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. దీనివల్ల పెట్టుబడులు, శ్రమ తగ్గడమే కాకుండా అధిక దిగుబడులను సాధించవచ్చు. రైతులు మునగ విత్తనాలు నాటి నుంచి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ సాగు చేపడితే కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది.
సాధారణంగా మునగ జనవరి నెలలో పూతకు వచ్చి ఫిబ్రవరీలో కాయలు కోతకు వస్తాయి. కాయలు కాసే సమయంలో నాలుగు నుంచి ఐదు రోజులకి ఒకసారి నీళ్ళు పెడితే నాణ్యమైన కాయల దిగుబడి పొందవచ్చు. అదే విధంగా జాగ్రత్తగా చీడ పీడ సమస్యలను రైతుల గమనిస్తూ సరైన సమయంలో సస్యరక్షణ చేపడితే మంచి దిగుబడులను పొందవచ్చు.
ఎరువుల యాజమాన్యం
ప్రతి పాదులో 10 కిలోల పశువుల ఎరువుతో పాటు 250 గ్రాముల వేపపిండి, 250 గ్రాముల సూపర్ పాస్ఫేట్ కలిపి వేయాలి. ఆలస్యంగా నాటితే మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటే పూతరాలి కాపురావడం నిలిచిపోతుంది. మొక్కలు 75- 90 సెంటీమీటర్లు పొడవు పెరిగిన తరువాత కొమ్మలను కత్తిరిస్తే ఏపుగా పెరిగి అధిక దిగుబడి వస్తుంది.
పురుగుల యాజమాన్యం
మునగను ఆశించే పురుగుల్లో గొంగలి పురుగు ప్రధానమైనది. గొంగలిపురుగు నివారణకు క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. దీంతో పాటు ఒక్కొక్క చెట్టుకు పాదులో 30 గ్రాములు కార్ట్రాలిన్పొడి, కార్భోఫ్యూరాన్ గుళికలు వేసుకోవాలి.
కాయతొలుచు ఈగ నివారణకు పూత ప్రారంభదశలో జోలోన్, పూర్తిగా పూత వచ్చిన తరువాత రోగార్, పిందెకట్టిన దశలో ఫిప్రొనిల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
కాండం కుళ్లు, వేరు కుళ్లు తెగులు సమస్య ఉంటే నివారణకు లీటరు నీటిలో 1 గ్రాము కార్బండైజిమ్ లేదా 3 గ్రాముల డైథేన్ ఎం-45 కలిపిన ద్రావణం ఇవ్వండి లేదంటే 1 శాతం బోర్డో మిశ్రమాన్ని మునగ మొక్క మొదలులో వేయండి.
Read Today's Latest Agriculture News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

