కోళ్లలో.. ఫౌల్ టైఫాయిడ్
పెరటి కోళ్లతోపాటు ఫారం కోళ్లలోనూ అధిక మరణాలు కలిగించే వ్యాధి.. ఫౌల్ టైఫాయిడ్. సాల్మొనెల్లా గాలిసేరియం అనే బ్యాక్టీరియా ద్వారా ఇది వ్యాపిస్తుంది.
పెరటి కోళ్లతోపాటు ఫారం కోళ్లలోనూ అధిక మరణాలు కలిగించే వ్యాధి.. ఫౌల్ టైఫాయిడ్. సాల్మొనెల్లా గాలిసేరియం అనే బ్యాక్టీరియా ద్వారా ఇది వ్యాపిస్తుంది. వ్యాధి సోకి చనిపోయిన కోళ్లలో 3 నెలల వరకు బ్యాక్టీరియా జీవించే ఉంటుంది. నీళ్లు, దాణాతోపాటు దాణా పాత్రలు కలుషితం కావడం వల్ల ఈ వ్యాధి ప్రబలుతుంది. వ్యాధికి గురైన కోళ్లు, చనిపోయిన పిల్లలు, ఈగల ద్వారా ఒకదాని నుంచి మరో దానికి వ్యాప్తి చెందుతుంది. పెద్ద పక్షుల్లో లక్షణాలు కనిపించకపోయినప్పటికీ, వ్యాధి వ్యాప్తికి కారణం అవుతాయి. పక్షుల శరీరంలోకి చేరిన బ్యాక్టీరియా.. ‘ఎండోటాక్సిన్’ అనే విషపదార్థాన్ని విడుదల చేస్తుంది. ఇది ఎర్రరక్తకణాల మీద ప్రభావం చూపుతుంది. ఫలితంగా కోళ్లలో రక్తహీనత వచ్చి, వాటి బరువు తగ్గుతుంది. గుడ్ల ఉత్పత్తి పైనా ప్రభావం పడుతుంది.
లక్షణాలు : పక్షుల్లో ఈ వ్యాధి తీవ్రత దశలవారీగా ఉంటుంది. కొన్ని పక్షులు ఎలాంటి లక్షణాలు లేకుండానే చనిపోతుంటాయి. ఎక్కువగా ‘పుల్లోరం’ లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధికి గురైన కోళ్లు బక్క చిక్కిపోతాయి. ఈకలు రాలిపోతాయి. చనిపోయిన కోళ్ల కాలేయం, గుండె కండరాలలో నెక్రోసిస్ (ఎముకలు, శరీర భాగాలు చచ్చుబడి పోవడం) లక్షణాలు గమనించవచ్చు. గుండె చుట్టూ ఫైబ్రస్ పొర అతుక్కుని ఉంటుంది.
చికిత్స : వ్యాధికి గురైన కోళ్లకు యాంటీ బయాటిక్ సెన్సిటివిటీ పరీక్ష చేసి.. దానికి సరిపోయే యాంటీ బయాటిక్ ఔషధాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ‘పుల్లోరం’ వ్యాధికి ఉపయోగించే ఔషధాలను కూడా ఉపయోగించవచ్చు.
Read Today's Latest Agriculture News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

