వైభవంగా విశ్వకర్మ జయంతి
పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ఆదివారం ఖానాపూర్ పట్టణ స్వర్ణకారుల సంఘం సభ్యుల ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు.
- విశ్వకర్మ చిత్రపటానికి ప్రత్యేక పూజలు
- విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శోభాయాత్ర
ఖానాపూర్ రూరల్, సెప్టెంబర్ 17 : పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ఆదివారం ఖానాపూర్ పట్టణ స్వర్ణకారుల సంఘం సభ్యుల ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. సభ్యులందరూ కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఖానాపూర్ పట్టణ స్వర్ణకారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.
కడెం మండలంలో..
కడెం, సెప్టెంబర్ 17: విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని కడెం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నాయకులు గొల్లపెల్లి వేణుగోపాల్, గొల్లపెల్లి వెంకటేశం, వంగల నాగరాజు, నర్సింగ్ రమేశ్, దేశరాజుల మహేశ్, సంకోజి తిరుపతి, కూచనపెల్లి శ్రీనివాస్, సదానందం, కరుణాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
దస్తురాబాద్ మండలంలో..
దస్తురాబాద్, సెప్టెంబర్ 17 : మండల కేంద్రంలో శ్రీ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ భవనంలో బ్రహ్మంగారి చిత్ర పటానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘ భవనం నుంచి పలు వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. విశ్వకర్మ పూజలో భాగంగా తమ పనిముట్లను ఆరాధిస్తామని సంఘం పెద్దమనుషులు తెలిపారు. కార్యక్రమంలో ప్రభాకర్, యమునురి బక్కన్న, నర్సయ్య, ప్రకాశ్, గంగాధర్, లక్ష్మీనర్సయ్య, గంగన్న, సత్తన్న, పరమానంద చారి, బ్రహ్మానంద చారి, లచ్చన్న, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
పెంబి మండలంలో..
పెంబి, సెప్టెంబర్ 17 : మండల కేంద్రంలోని హరిహర ఆలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలకు విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్ర పటానికి పూలమాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం మండలాధ్యక్షుడు దేశరాజు నారాయణ, సభ్యులు సత్యనారాయణ, గంగాధర్, గోవర్ధ్దన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

