కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

బజార్హత్నూర్ : టీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పిలుపునిచ్చారు. బజార్హత్నూర్ మండలంలో నూతనంగా ఎన్నికైన గ్రామకమిటీల అధ్యక్షులు, మండల కమిటీల సభ్యులు శనివారం ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సభ్యులందరినీ శాలువాతో సన్మానించారు. మండల కన్వీనర్‌గా రాజారాం రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికకావడంతో బజార్హత్నూర్ మండల కార్యకర్తలు , నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని, పార్టీ అభ్యున్నతికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆయన కోరారు.
అంతకుముందు మండల కన్వీనర్ రాజారాంకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొడ్డు శ్రీనివాస్,మడిగే రమణ, భాస్కర్‌రెడ్డి, సింగ్, ప్రకాశ్, ఉత్తం, విజేందర్, మధుకర్, నరేశ్, విద్యాసాగర్, శశికళ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

