ఆదిలాబాద్ : జిల్లాను పొగమంచు కమ్మేసింది. జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులనుంచి పొగ మంచు కమ్ముకుంది. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు చల్లటి ఈదురు గాలులు వీస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆకాశం మేఘా వృతమై పూర్తిగా పొగమంచు కమ్ముకు పోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.