ఆటో యూనియన్ ఎన్నికలపై రగడ
జిల్లాలో ఆటో యూనియన్ ఎన్నికల్లో రగడ రాజుకుంది. అధికార పార్టీ నాయకుల జోక్యంతో యూనియన్ ఎన్నికలను ఏకగ్రీవం చేశారంటూ అసమ్మతి వర్గానికి చెందిన నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించి కొత్త యూనియన్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఈ పంచాయితీ కాస్త గురువారం రోజు మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఇప్పటికే ఎన్నికైన యూనియన్ నాయకుల ఫిర్యాదుతో పోలీసులు ఇరువర్గాల యూనియన్ సభ్యులను పిలిపించి మాట్లాడారు.
- పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయితీ
మంచిర్యాల అర్బన్, జూలై 25 : జిల్లాలో ఆటో యూనియన్ ఎన్నికల్లో రగడ రాజుకుంది. అధికార పార్టీ నాయకుల జోక్యంతో యూనియన్ ఎన్నికలను ఏకగ్రీవం చేశారంటూ అసమ్మతి వర్గానికి చెందిన నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించి కొత్త యూనియన్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఈ పంచాయితీ కాస్త గురువారం రోజు మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఇప్పటికే ఎన్నికైన యూనియన్ నాయకుల ఫిర్యాదుతో పోలీసులు ఇరువర్గాల యూనియన్ సభ్యులను పిలిపించి మాట్లాడారు. అసమ్మతి వర్గానికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదని తెలిసింది. మంచిర్యాల పట్టణానికి సంబంధించి 21 ఆటో అడ్డాలు ఉన్నాయి. వీరిలో కొందరు ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దగ్గరకు వెళ్లి అధ్యక్షుడిగా ఉండాలని కోరినట్లు తెలుస్తుంది. తాను అధ్యక్షుడిగా ఉండాలంటే మొదటగా మీ పట్టణ అధ్యక్షుడిని ఎన్నుకోండి.. అప్పుడు నేనే అధ్యక్షుడిగా ఉంటానని సదరు నేత వారికి చెప్పినట్లు సమాచారం. ఏకగ్రీవంగా ఎన్నికలు చేద్దామంటే ఎవరూ ఒప్పుకోలేదు. దీంతో నెల క్రితమే ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్నికల తేదీలు అనౌన్స్ చేసి, నామినేషన్లు వేయగా, ఎన్నికలు నిర్వహించే సమయంలో ఓ నాలుగు అడ్డాలకు చెందిన వ్యక్తులు హాజరు కాలేదు.
మిగిలిన 16 అడ్డాల నుంచి ఐదుగురు నామినేషన్ దాఖలు చేయగా, అందులోనుంచి ముగ్గురు విత్‌డ్రా చేసుకున్నారని, మిగిలిన ఇద్దరిలో అధ్యక్షుడిగా ఒకరు, ఉపాధ్యక్షుడిగా మరొకరిని ఎన్నుకున్నారని యూనియన్‌లోని ఓ వర్గం చెబుతున్నది. ఇలా ఎన్నికల ప్రక్రియ ముగిశాక కొత్తగా పట్టణ ఆటో యూనియన్ ఎన్నికలు నిర్వహించేందుకు కొందరు సిద్ధమయ్యారని ఆరోపిస్తున్నారు. దీనిపైనే ఆటో యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామంటున్నారు. మరోవర్గం మాత్రం ఎన్నికలు నిర్వహించలేదని, ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారని, కచ్చితంగా ఎన్నికలు నిర్వహించి తీరుతామని చెబుతున్నారు. ఆటో యూనియన్ ఎన్నికల్లో అధికార పార్టీ జోక్యం చేసుకుంటుందంటూ మండిపడుతున్నారు. దాదాపు 60 మంది సంతకాలు పెట్టి ఎలక్షన్లు వాయిదా వేయాలని కోరినా పట్టించుకోకుండా వాళ్లకు వాళ్లే నాయకులను ఎన్నుకున్నారంటున్నారు. పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఎన్నికలు ఆపాలని కోరుతున్నారని, తాము ఎలాగైనా ఎన్నికలకు వెళ్తామని,. ఈ విషయంలో పోలీసులు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. దీనిపై మంచిర్యాల సీఐ బన్సీలాల్‌ను వివరణ కోరగా, ప్రస్తుతం ఉన్న యూనియన్ నాయకులు ఫిర్యాదు ఇచ్చారని, వారిని పిలిపించి ఏసీపీ మాట్లాడారని చెప్పారు. ఈ ఆటో యూనియన్ల పంచాయతీ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి మరి.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

