కౌటాల, జనవరి 4 : మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో గురువారం శ్రీ నరేంద్ర ఆచార్య పాదుకల దర్శనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మార్కెట్ ఏరియా నుంచి మినీ స్టేడియం వరకు పాదుకలను సంప్రదాయ వాయిద్యాలు, మహిళల నృత్యాల నడుమ ఊరేగించారు. మహారాష్ట్రలోని నానిజ్ దాం నుంచి తీసుకువచ్చిన పాదుకలకు పూజలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.