అంతర సాగు.. లాభాలు బాగు..
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామంలో 150 ఎకరాల్లో వరి సాగువుతోంది. అంతర పంటగా బీర వేశారు. నాట్లు వేసిన వారం తర్వాత బీర విత్తనాలను పొలం గట్ల పక్కన నాటుతారు. 20 రోజుల్లో తీగలు వస్తాయి. వీటికి సపోర్టుగా కర్రలు అమర్చుతారు.
- పొలం గట్ల వెంట బీర విత్తనాలు నాటివేత
- కిష్టంపేటలో పదేండ్లుగా సాగు చేస్తున్న రైతన్నలు
- అదనపు ఆదాయం సమకూరు తుండడంతో అన్నదాతల సంతోషం
- ప్రధాన మార్కెట్లలో విక్రయాలు..
వరిలో అంతర సాగు కాసులు కురిపిస్తున్నది. వరి పొలం గట్ల వెంట బీర విత్తనాలు నాటితే అదనపు ఆదాయం సమకూరుతున్నది. సేద్యానికి పెట్టుబడి తక్కువగా ఉండడం.. దిగుబడి పెరిగి లాభాలు వస్తుండడంతో రైతులు మొగ్గు చూపుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేటలో 150 ఎకరాల్లో వరి సాగవుతుండగా.. అంతర పంటగా బీర వేశారు. పదేండ్లుగా సాగు చేస్తున్నారు. చెన్నూర్‌తోపాటు మంచిర్యాల, గోదావరిఖని, బెల్లంపల్లి, మందమర్రి పట్టణాలకు సరఫరా చేస్తూ లాభాలు గడిస్తున్నారు. వరి కన్నా బీర సాగే మేలని రైతులు పేర్కొంటున్నారు.
చెన్నూర్ రూరల్, ఏప్రిల్ 16 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామంలో 150 ఎకరాల్లో వరి సాగువుతోంది. అంతర పంటగా బీర వేశారు. నాట్లు వేసిన వారం తర్వాత బీర విత్తనాలను పొలం గట్ల పక్కన నాటుతారు. 20 రోజుల్లో తీగలు వస్తాయి. వీటికి సపోర్టుగా కర్రలు అమర్చుతారు. నీరు అధికంగా ఉండడంతో చెట్లు బలంగా, ధృడంగా ఉంటాయి. వారానికోసారి మందు పిచికారీ చేస్తారు. వరి కోతకు వచ్చే సమయానికి రెండు సార్లు బీర దిగుబడి చేతికొస్తుంది. రెండెకరాల వరి సాగులో దాదాపు 15-20 క్వింటాళ్ల బీర దిగుబడి వస్తుంది. ప్రస్తుతం కిలో ధర రూ.60-రూ.80 పలుకుతోంది. యేటా ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం సమకూరుతుంది. బీర సాగుకు పెట్టుబడి తక్కువ. సుమారు రెండెకరాల్లో వరి వేస్తే బీర విత్తనాలకు రూ.2 వేల-రూ.3 వేల వరకు అవుతాయి. రెండు నెలల బీర కాపులో సుమారు రూ.10 వేల-రూ.20 వేల వరకు మందులు అవుతాయి. బీర కాయలను చెన్నూర్‌తోపాటు మంచిర్యాల, గోదావరిఖని, బెల్లంపల్లి, మందమర్రి మార్కెట్లకు తీసుకెళ్లి హోల్ సేల్‌గా విక్రయిస్తారు. పదేండ్లుగా గ్రామస్తులు వరిలో అంతర పంటగా బీర సాగు చేస్తున్నారు. వరి కన్నా బీర సాగే మేలని రైతులు పేర్కొంటున్నారు.
వరి కన్న బీర మేలు..
వరి కన్నా బీర సాగే మేలు. నేను ఐదెకరాల్లో వరి సాగు చేస్తున్నా. అంతర పంటగా పొలం గట్ల వెంబడి బీర విత్తనాలు నాటిన. ధాన్యం దిగుబడితో వచ్చే డబ్బుల కంటే బీర సాగుతో వచ్చే ఆదాయమే అధికంగా ఉంటుంది. బీర కాపు ముగిసే సరికి సుమారు రూ.ఒక లక్ష అదనపు ఆదాయం సమకూరుతుంది.
– జిల్లాల మాల్లారెడ్డి, రైతు, కిష్టంపేట
పదేండ్లుగా బీర సాగు చేస్తున్న..
కిష్టంపేటలో పదేండ్లుగా వరితోపాటు అంతర పంటగా బీర సాగు చేస్తున్నా. మూడు నెలల్లో బీర కాపుతో అధిక దిగుబడులు వస్తున్నాయి. వారానికి రెండు లేదా మూడు సార్లు బీర పంట చేతికి వస్తుంది. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తు, తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందుతున్నా.
– బైరి సత్యనారాయణ గౌడ్, రైతు, కిష్టంపేట
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- beer cultivation
- farmers
- rice
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

