ప్రజా శ్రేయస్సే పోలీసుల ధ్యేయం
ప్రజా శ్రేయస్సే పోలీసుల ధ్యేయమని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. పోలీసులు-మీ కోసం కార్యక్రమంలో భాగంగా శనివారం కోటపల్లి పో లీస్ స్టేషన్లో నీల్వాయి, కోటపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలోని యువకులతో సమావేశం నిర్వహించారు.
- రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్
కోటపల్లి, జూన్ 15 : ప్రజా శ్రేయస్సే పోలీసుల ధ్యేయమని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. పోలీసులు-మీ కోసం కార్యక్రమంలో భాగంగా శనివారం కోటపల్లి పో లీస్ స్టేషన్లో నీల్వాయి, కోటపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలోని యువకులతో సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ యువత లక్ష్యంతో ముందుకు సాగి అభ్యున్నతి సాధించాలన్నా రు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాల ను అధిరోహించాలని, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించవచ్చన్నారు. గంజాయి, మద్యం, జూదంవంటి వ్యసనాలకు దూ రంగా ఉండాలన్నారు. సంఘవిద్రోహశక్తుల ప్రలోభాలకు లొం గకూడదని, అనుమానితులు కనిపిస్తే పోలీస్‌లకు సమాచా రం ఇవ్వాలన్నారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా పరిష్కరించేందుకు పోలీస్ శాఖ ముందుంటుందని చెప్పారు. అనంతరం కో టపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల యూత్‌కు వాలీబాల్, క్రికెట్ కిట్లు, జెర్సీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ అశోక్‌కుమార్, జైపూర్ ఏసీ పీ వెం కటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, చె న్నూర్ రూరల్ సీఐ సుధాకర్, ఎన్ఐబీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కో టపల్లి ఎస్ఐ రాజేందర్, నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

