ఫొటో కొట్టు..కాలుష్యం పనిపట్టు..
రోడ్డుపై చెత్తాచెదారం ఉన్నదా? ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలు వెలువడుతున్నాయా? ప్లాస్టిక్, ఈ, మెడి వేస్ట్ అధికమయ్యాయా..? చెరువులు, కుంటల్లోకి మురుగు నీరు చేరుతున్నదా..? స్థానిక, మండల, జిల్లాస్థాయి అధికారులకు చెప్పినా స్పందించడం లేదా.
- ఆన్లైన్లో ఫిర్యాదు చేసేందుకు అవకాశం
- ‘జనవాణి-కాలుష్య నివారిణి’ పేరిట యాప్
- ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించనున్న అధికారులు
రోడ్డుపై చెత్తాచెదారం ఉన్నదా? ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలు వెలువడుతున్నాయా? ప్లాస్టిక్, ఈ, మెడి వేస్ట్ అధికమయ్యాయా..? చెరువులు, కుంటల్లోకి మురుగు నీరు చేరుతున్నదా..? స్థానిక, మండల, జిల్లాస్థాయి అధికారులకు చెప్పినా స్పందించడం లేదా..? ఇటువంటి సమస్యలకు చెక్ పెట్టడానికి ‘జనవాణి కాలుష్య నివారిణి’ యాప్‌ను తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు(టీఎస్‌పీసీబీ) తీసుకొచ్చింది. దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక జిల్లా పేరు నమోదు చేయాలి. అనంతరం పొల్యూషన్ టైప్(నీరు, శబ్ధ, గాలి, సాలిడ్ వేస్ట్, మురుగు, వాహన కాలుష్యం, ఇండస్ట్రీయల్ కాలుష్యం, చెత్తను తగలబెట్టడం, నిర్మాణాల కూల్చివేతలకు వ్యర్థాల నిర్వహణ, రోడ్డుపై చెత్తాచెదారం, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం) ఇలా రకరకాల అంశాలవారీగా ఫిర్యాదులను ఎంచుకోవాలి.
అనంతరం వాటి గురించి క్లుప్తంగా రాసి ఫొటో తీసి మన ప్రాంతం, ఏరియా, లొకేషన్, ఫిన్కోడ్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ ఎంటర్ చేసి కింద ఉన్న లోడ్ కంప్లయింట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అంతే మనం ఇచ్చిన కంప్లయింట్ ఏ అధికారికి చేరాలో వారికి నేరుగా వెళ్లిపోతుంది. వెంటనే వారు స్పందిస్తారు. ఫోన్ ద్వారా, మెయిల్ ద్వారా మిమ్ములను సంప్రదించి సమస్యకు పరిష్కారం చూపిస్తారు.
– మంచిర్యాల, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

