వైభవంగా దసరా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం దసరా వేడుకలు వైభవంగా సాగాయి. పలుచోట్ల ఆయుధ, వాహన పూజలు నిర్వహించగా, భక్తుల దర్శనాలతో ఆలయాలు సందడిగా కనిపించాయి. రాత్రివేళ నిర్వహించిన రామ్‌లీల కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రావణుడి బొమ్మల దహనాలతో వేడుకలు ముగిశాయి. మరోవైపు తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకుంటున్న దుర్గామాత ప్రతిమలను
- విజయాలకు ప్రతీక.. దశమి
- నిర్మల్ ఎస్పీ ప్రవీణ్‌కుమార్
- సాయుధ దళ కార్యాలయంలో ఆయుధ పూజ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం దసరా వేడుకలు వైభవంగా సాగాయి. పలుచోట్ల ఆయుధ, వాహన పూజలు నిర్వహించగా, భక్తుల దర్శనాలతో ఆలయాలు సందడిగా కనిపించాయి. రాత్రివేళ నిర్వహించిన రామ్‌లీల కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రావణుడి బొమ్మల దహనాలతో వేడుకలు ముగిశాయి. మరోవైపు తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకుంటున్న దుర్గామాత ప్రతిమలను వాగులు, చెరువుల్లో నిమజ్జనం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
నిర్మల్ చైన్‌గేట్, అక్టోబర్ 5 : విజయాలకు ప్రతీక దసరా (విజయదశమి) అని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. నిర్మల్ జిల్లా సాయుధ దళ కార్యాలయంలో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జమ్మిచెట్టుకు పూజలు నిర్వహించా రు. వాహనాలు, ఆయుధాలకు పూజలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడు తూ.. శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి ఉంటుందని చెప్పా రు. అలాంటి విజయాలను చేకూర్చే దశమి పర్వదినోత్సవం అందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో ప్రతి స్థాయిలోని అధికారి ప్రజా రక్షణలో ముందుంటూ, మన్ననలు అందుకుంటూ పోలీస్ శాఖ గౌరవం మరింత పెంచేలా పనిచేయాలన్నారు. దేవతా విగ్రహాల నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు. గణేశ్ ఉత్సవాల మాదిరిగానే అందరూ సంయమనం పాటించాల ని కోరారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ కిరణ్‌ఖారే, ఎస్బీఐ రమేశ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు హతీరాం, రమేశ్, ఎంటీవో వినోద్, సాయుధ దళ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇనుప సామగ్రికి పూజలు
నార్నూర్,అక్టోబర్ 5 : ఉమ్మడి మండలంలోని ఆదివాసీ గూడేల్లో ఆదివాసీలు ఇళ్లల్లో వ్యవసాయ పనులకు వినియోగించే ఇనుప సామగ్రికి బుధవారం పూజలు నిర్వహించారు. ముందుగా వాటి ని నీళ్లతో శుభ్రంగా చేశారు. అనంతరం సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. విజయదశమి రోజు న తాము ఇళ్లల్లో, పొలంలో వాడే ఇనుప సామగ్రికి పూజలు నిర్వహిస్తామని గ్రామపెద్దలు తెలిపా రు. దసరా సందర్భంగా ఆయుధ పూజ చేయడం ఆనవాయితీ అని పేర్కొన్నారు. ఇందులో భాగం గా వ్యవసాయ పనులకు వినియోగించే నాగలి, ఎడ్ల బండి, పలుగు, పార, కొడవలి తదితర వాటి కి పూజలు చేశామని తెలిపారు. వీటికి పూజలు చేస్తే పంటలు బాగా పండుతాయని తాము నమ్ముతామని, అందుకే ప్రతి యేటా దసరా సందర్భంగా వాటిని పూజిస్తామని చెప్పారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

