ప్రమాదకరంగా ఎన్‌హెచ్-63..
హాజీపూర్ మండలంలోని వేంపల్లి, ముల్కల్ల, రాపల్లి, దొనబండ గ్రామాల మీదుగా వెళ్లే జాతీయ రహదారి- 63 అస్తవ్యస్తంగా మారింది. వేంపల్లి శివారు నుంచి రోడ్డుకు ఇరువైపులా ముళ్లు, చెట్ల పొదలు రాకపోకలకు అడ్డుగా మారి రహదారి ఇరుకుగా మారింది.
- రోడ్డుకు ఇరువైపులా అడ్డుగా చెట్ల పొదలు
- ప్రమాదకరంగా గుంతలు, కల్వర్ట్లు
- పట్టించుకోని అధికారులు
హాజీపూర్, ఫిబ్రవరి 4 : హాజీపూర్ మండలంలోని వేంపల్లి, ముల్కల్ల, రాపల్లి, దొనబండ గ్రామాల మీదుగా వెళ్లే జాతీయ రహదారి- 63 అస్తవ్యస్తంగా మారింది. వేంపల్లి శివారు నుంచి రోడ్డుకు ఇరువైపులా ముళ్లు, చెట్ల పొదలు రాకపోకలకు అడ్డుగా మారి రహదారి ఇరుకుగా మారింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ముల్కల్ల గ్రామంలో తాగునీటి పైప్‌లైన్‌ను రోడ్డుకు అవతలి వైపునకు వేసేందుకు రోడ్డును తవ్వి గుంతను తీసి పైప్‌లైన్‌ను వేశారు. అధికారులు గుంతను సక్రమంగా పూడ్చక పోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
దీన్ని గమనించిన మాజీ జడ్పీటీసీ పుస్కూరి శిల్ప-శ్రీనివాస్ రావు దంపతులు తమ సొంత ఖర్చులతో సిమెంట్, కంకర వేయించి గుంతను మూసి వేయించారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ గుంతలు ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ముల్కల్ల సర్పంచ్ మంచాల శ్రీనివాస్ కారులో వెళ్తూ ఈ గుంతలో పడడంతో పల్టీకొట్టింది. ఆ ప్రాంతంలో దాదాపు పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగి గాయాలతో బయటపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెట్ల పొదలను తొలగించాలని, గుంతలను పూడ్చాలని, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

