మహిళలు, బాలికలు, విద్యార్థినుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన షీ టీమ్.. మరింత భరోసా కల్పిస్తున్నది. నిర్మల్ జిల్లాలో 2016, నవంబర్ 9న సేవలు ప్రారంభమవగా.. మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన, ఇబ్బందులకు గురిచేసిన, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన వారిపై ఉక్కుపాదంమోపుతున్నది. ఈ బృందం నిత్యం మఫ్టీలో ఉంటూ ఆకతాయిల ఆగడాలను గమనిస్తున్నది. ఇప్పటి వరకు జిల్లాలో 25 మంది ఆకతాయిలను పట్టుకొని కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు, 2 కేసులు నమోదుచేసింది. 115 హాట్‌స్పాట్ కేంద్రాలను గుర్తించగా,వాటిపై మరింత దృష్టిపెట్టింది.
– నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 30
నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా డివిజన్ల వారీగా షీటీమ్స్ ఏర్పాటు చేశారు. నిర్మల్, భైం సా, ఖానాపూర్ ప్రాంతాల్లోని 115 హాట్స్పాట్ల ను పోలీసులు గుర్తించారు. షీ టీం బృందాలను ఏర్పాటు చేసి నిఘా పటిష్టం చేశారు. ఆ ప్రాం తాల్లో విద్యార్థినులు, యువతులు, మహిళలపై వేధింపులు జరుగుతున్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ ప్రాంతాల్లో 559 సార్లు పర్యటించినట్లు ఎస్పీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. నిర్మల్ డివిజన్లో 58 హాట్‌స్పాట్ కేంద్రాల్లో 389 సార్లు సందర్శించారు. 84 పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, ఫోక్సో, షీ టీం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అంశాలపై అవగాహన కల్పించారు. భైంసా డివిజన్లో 57 హాట్‌స్పాట్ కేంద్రాలను గుర్తించగా.. 170 సార్లు పోలీసులు సందర్శించారు. 18 పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పించారు.
క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదులు..
జిల్లాలో 24 గంటల పాటు మహిళల భద్రత కోసం పోలీసులు కృషిచేస్తున్నారు. ఒకసారి వేధిస్తూ పట్టుబడితే కుటుంబ సభ్యులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. తీరు మారకపోతే నిర్భయ చట్టం కింద కేసులను నమోదు చేస్తున్నారు. ఆకతాయిలపై ఫిర్యాదు చేసేందుకు వెనుకాడవద్దని, వివరాలను గోప్యం గా ఉంచుతామని పోలీసులు సూచిస్తున్నారు. ఫి ర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్ వరకు రావాల్సి న పనిలేదని, క్యూ ఆర్ కోడ్ ఆధారంగా కూడా కంప్లెయింట్ చేయవచ్చని అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని అత్యంత రద్దీ ప్రదేశాల్లో సం బంధిత పోస్టర్లను అందుబాటులో ఉంచామని, కోడ్‌ను స్కాన్ చేయగానే Http qr.tspolice. gov.in లింక్ వస్తుందని పేర్కొన్నారు. దానిపై క్లిక్ చేయగడానే ఫిర్యాదు పారం ఓపెన్ అవుతుందని, ఇందులో పేరు లొకేషన్ వివరాలు పూరించి సబ్మిట్ చేయగానే జిల్లా పోలీస్ కార్యాలయంలోని షీ టీమ్ సాఫ్ట్వేర్ విభాగానికి చేరుతుందని వివరించారు. అక్కడ నిరంతరం పర్యవేక్షించే సిబ్బంది ఆన్లైన్ ఫిర్యాదులపై దృష్టిపెట్టి, ఆ లొకేషన్ పరిధిలోనికి ఫార్వర్డ్ చేయడంతో సంబంధి త పోలీసు అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని తదుపరి చర్యలు చేపడుతారని వెల్లడించా రు. లేకుంటే డయల్ 100కు గానీ, షీ టీం వా ట్సాప్ నంబర్ 9490619043కు ఫోన్ చేసినా, sheteamnirmal123 gmail. comకు ఫి ర్యాదు చేసిన తక్షణ సేవలు అందించనున్నారు.
వేదిస్తే ఫిర్యాదు చేయండి..
ఎవరైనా వేధించినా, అసభ్యకరంగా మాట్లాడినా బాధితులు వెంటనే డయల్ 100కు గానీ, షీ టీం నంబర్ 9490619043కు గానీ సమాచారం అందించాలి. వివరాలను గోప్యంగా ఉంచుతాం. బాధితులు పోలీస్ స్టేషన్‌కు రాకుండానే ఆకతాయిలకు, వారి కుటుంబ సభ్యుల మధ్య కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. పద్ధతి మార్చుకోకపోతే కేసు నమోదు చేసి, కఠిన శిక్షలను విధిస్తాం.
– సీహెచ్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ, నిర్మల్ జిల్లా
హాట్స్పాట్లపై నిఘా..
నిర్మల్‌ను ఈవ్‌టీజింగ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు షీటీం పోలీసులు కృషిచేస్తున్నారు. ఈవ్‌టీజర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు జిల్లాలో గుర్తించిన హాట్స్పాట్లపై నిత్యం నిఘా పటిష్టం చేస్తున్నాం. మఫ్టీలో పోలీసులను ఉంచుతూ ఆకతాయిల భరతం పడుతున్నాం. జిల్లాలో 25 మంది ఆకతాయిలకు కౌన్సెలింగ్ ఇవ్వగా, ఇద్దరిపై 2 కేసులు నమోదు చేశాం.
– సుమన్ రెడ్డి, షీటీం ఎస్ఐ, నిర్మల్