MLC Elections | ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 862 ఓట్లు పోలవగా.. టీఆర్ఎస్ అభ్యర్థి దండే విఠల్‌కు మొత్తం 740 ఓట్లు వచ్చాయి.
సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి పుష్కరానికి కేవలం 74 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం 666 ఓట్ల మెజార్టీతో విఠల్ విజయం సాధించారు. ఆదిలాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం చెల్లని ఓట్లు 48 నమోదయ్యాయి.