కల్లు తయారీ కేంద్రంపై ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ దాడులు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో నిర్వహిస్తున్న కల్లు తయారీ కేంద్రంపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం ఆకస్మిక దాడులు చేశారు. తయారీ కేంద్రంలో లభించిన తెల్లకల్లు శాంపిళ్లను సేకరించారు. ఆ బాటిళ్లకు నిబంధనల ప్రకారం సీల్ వేసి సీజ్ చేశారు.
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో నిర్వహిస్తున్న కల్లు తయారీ కేంద్రంపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం ఆకస్మిక దాడులు చేశారు. తయారీ కేంద్రంలో లభించిన తెల్లకల్లు శాంపిళ్లను సేకరించారు. ఆ బాటిళ్లకు నిబంధనల ప్రకారం సీల్ వేసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ సీఐ సమ్మయ్య మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన కల్తీ కల్లు ఘటన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రైడింగ్స్ జరుగుతున్నాయని అన్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా దాడులు నిర్వహించినట్లు సీఐ సమ్మయ్య తెలిపారు. సేకరించిన తెల్ల కల్లు బాటిళ్లను సీజ్ చేసి నిజామాబాద్‌లోని కెమికల్ ల్యాబ్‌కు తరలించినున్నట్లు వెల్లడించారు. అక్కడి నుంచి రానున్న రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది సాగర్, రమేశ్, కవిత పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

