Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Singareni Simha Garjana | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సింగరేణి కార్మికులకు సంక్షేమ పథకాలు, హక్కులు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సాధించామని టీబీజీకేఎస్బె ల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజు శ్రీనివాసరావు తెలిపారు.
తాండూర్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సింగరేణి కార్మికులకు సంక్షేమ పథకాలు, హక్కులు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సాధించామని టీబీజీకేఎస్ ( TBGKS ) బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజు శ్రీనివాసరావు తెలిపారు. మళ్లీ కేసీఆర్ రావాలని కార్మికులు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.
ఈనెల 14న గోదావరిఖనిలో జరగబోయే కేటీఆర్ సింహా గర్జన( Simha Garjana ) భారీ బహిరంగ సభకు బెల్లంపల్లి ఏరియా నుంచి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం తాండూర్ మండలంలోని ఏరియా వర్క్‌షాప్ లో ఫిట్ సెక్రటరీ గాజువేని శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన గెట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సింగరేణి ఎన్నికల సమయంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కూటమి కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే నెరవేర్చి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికుల చిరకాల స్వప్నమైన 250 గజాల స్థలం, 20 లక్షల వడ్డీ లేని రుణంపై ఇన్‌కం టాక్స్ రద్దు చేస్తామని అలవికాని హామీలను ఇచ్చి కార్మికులను మోసం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ సభ్యులు సంపతి, తిరుపతి, ఏరియా కార్యదర్శులు మారిన వెంకటేశ్వర్లు, ఓరం కిరణ్, అసిస్టెంట్ కార్యదర్శి సురేష్, స్టోర్ ఫిట్ సెక్రెటరీ గణపతి, నాయకులు రమేష్, వైకుంఠం, సూరం వెంకన్న, కనకయ్య, వెంకటస్వామి, చంద్రయ్య, మహిళా కార్మికులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

