సంబురాల సంక్రాంతి రానే వచ్చింది. పట్టణవాసులు సొంతూళ్లకు చేరుకోగా, ప్రతి ఇల్లూ కళకళలాడుతున్నది. ముగ్గులతో ముస్తాబైన వాకిళ్లు కనువిందు చేస్తుండగా, గంగిరెద్దుల విన్యాసాలు.. పిల్లల ఆటాపాటలతో ఎటు చూసినా సందడే కనిపిస్తున్నది.
ఆదివారం భోగిని వైభవంగా నిర్వహించిన ప్రజానీకం, నేడు మకర సంక్రాంతి, రేపు కనుమను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమైంది.