సత్వర న్యాయం కోసమే లోక్ అదాలత్‌లు
జాతీయ లోక్ అదాలత్‌లో కక్షిదారులు కేసులను పరిష్కారం చేసుకుంటే ఇద్దరి గెలుపు అవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్ఎస్ఏ చైర్మన్ కె.ప్రభాకర్‌రావు అన్నారు. శనివారం డీఎల్ఎస్ఏ సమావేశ మందిరంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
- ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్‌రావు
ఎదులాపురం, జూన్ 8 : జాతీయ లోక్ అదాలత్‌లో కక్షిదారులు కేసులను పరిష్కారం చేసుకుంటే ఇద్దరి గెలుపు అవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్ఎస్ఏ చైర్మన్ కె.ప్రభాకర్‌రావు అన్నారు. శనివారం డీఎల్ఎస్ఏ సమావేశ మందిరంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజీమార్గంలో పలువురు కక్షిదారులు కేసులు పరిష్కరించుకోగా వారికి పత్రాలను ఎస్పీ గౌష్ ఆలంతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో పరిష్కారం అయిన కేసులు అప్పిల్ చేసుకోవడానికి వీలు ఉండదన్నారు. కేసులు పరిష్కారం చేసుకుంటే డబ్బు, సమయం ఆదా అవుతాయన్నారు. 25 సివిల్ కేసులు, 1595 క్రిమినల్ కేసులు, 15807 పీఎల్సీ కేసులు పరిష్కారం అయ్యా యి. ఈ సమావేశంలో న్యాయమూర్తులు పి.శివరాంప్రసాద్, డాక్టర్ ప్రమీలా జైన్, మంజుల సూర్యవార్, టి.దుర్గారాణి, డీఎల్ఎస్ఏ కార్యదర్శి బి.సౌజన్య, బార్ అధ్యక్షుడు నగేశ్, డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, సైబర్ క్రైమ్ డీఎస్పీ హాజిబ్ఉల్లా పాల్గొన్నారు.
నగదు అందజేత
సైబర్ నేరస్తుల చేతులో మోసపోయిన పోశెట్టికి రూ.20 వేలు, వైద్యవిద్యార్థికి రూ.23,870, మసూద్ హైమాద్కు రూ.15 వేల నగదును జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్‌రావు, ఎస్పీ గౌష్ ఆలంతో కలిసి అందజేశారు.
జైలు సందర్శన
జిల్లా జైలును జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకార్‌రావు, జిల్లా ఎస్పీ గౌష్ ఆలంలు కలిసి సందర్శించారు. జైలు ఆవరణలో పచ్చదనం నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ జైల్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్‌ను అభినందించారు.
కోర్టు స్థలాన్ని పరిశీలించిన జడ్జి
బోథ్, జూన్ 8 : బోథ్‌లో నూతనంగా నిర్మించతలపెట్టిన కోర్టు భవన నిర్మాణ స్థలాన్ని శనివారం జిల్లా జడ్జి ప్రభాకర్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. ఆయన వెంట బోథ్ జడ్జి హుస్సేన్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వామన్రావ్ దేశ్ పాండే, అంగద్ కేంద్రె, మోహన్రావ్, పంద్రం శంకర్, ఆడెపు హరీశ్, కుమ్మరి విజయ్, జమీర్, దమ్మాపాల్, కోర్టు సూపరింటెండెంట్ శేఖర్‌రెడ్డి, ఎస్సై రాము ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

