లాక్డౌన్ నిబంధనలు పాటిద్దాం.. కరోనాను కట్టడి చేద్దాం : ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర

ఆదిలాబాద్ : లాక్డౌన్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ కరోనాను కట్టడి చేద్దామని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలో లాక్డౌన్ అమలు తీరును ఎస్పీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. పట్టణ శివార్లలోని కాలనీలో బందోబస్తు అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. లాక్డౌన్ నిబంధనలు కఠినంగా పాటించడంతో కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రస్తుతం కరోనా పరీక్షలు చేసినవారిలో కేవలం 1.6 శాతం మందికి మాత్రమే పాజిటివ్ కేసులు నమోదు కావడం శుభపరిణామం అన్నారు. ఇది జిల్లా ప్రజల విజయంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులు సంబంధిత ఐడీ కార్డు/పాస్ విధిగా తమతో తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ సమయంలో అనుమతుల కోసం ఇప్పటివరకు 4259 ఆన్లైన్ దరఖాస్తులు రాగా 1983 దరఖాస్తుదారులకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. సరైన పత్రాలు సమర్పించకపోవడంతో మిగతా దరఖాస్తులను తిరస్కరించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి దరఖాస్తులు పెండింగ్లో లేవని వెల్లడించారు. వ్యవసాయదారులు, సంబంధిత వ్యాపారులకు ఎటువంటి ఆటంకం కలుగకుండా సంబంధిత డీఏవో, మార్క్ ఫెడ్ అధికారులు జారీ చేసిన పాస్, పత్రాలతో రావాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
క్లిష్ట పరిస్థితుల్లో పోలీసులకు సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరి కృషి ఫలితమే నేడు విజయవంతమైన ఫలితాలు అన్నారు. రానున్న రోజుల్లో ఇలాగే నిబంధనలు పాటిస్తూ కరోనా వైరస్ మహమ్మారిని పూర్తిగా కట్టడి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎస్. శ్రీనివాస రావు, బి. వినోద్ కుమార్, డీఎస్పీలు ఎన్ఎస్వి వెంకటేశ్వరరావు, కె. ఉమామహేశ్వరరావు, వీపూరి సురేష్, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

