నేరడిగొండ, జూన్ 17 : బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్‌కు బీఆర్ఎస్ పార్టీ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన సన్ని హితుల ద్వారా స్వయంగా పుష్పగుచ్ఛం, ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన పత్రాన్ని అందించి ఆత్మీ య జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. “పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తూ, నిబ ద్ధత కలిగిన నాయకుడు అలుపెరుగని శ్రమ వ ల్లనే పార్టీ నియోజకవర్గంలో ఇంత బలంగా, ప్రజల గుండెల్లో పదిలంగా ఉందని తను రాసిన పత్రంలో కొనియాడారు.
పుట్టిన రోజును మీ జీవితం లో మరింత ఆనందాన్ని సరికొత్త ఉత్సాహాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కో రుకుంటున్నా. మీరు ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని, భవి ష్యత్‌లోనూ మీ సేవలు పార్టీకి, ప్రజలకు విస్తృతంగా అందాలని ఆకాం క్షిస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్‌లో మీరు పార్టీకి, ప్రజలకు మరింత సేవ చేస్తారని నమ్ముతున్నానని కోరుతూ.. మీ సేవలకు మనసారా అభినంది స్తూ.. హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అని పత్రంలో తెలిపారు.