కుమ్రం భీం ఆసిఫాబాద్ : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్మి, షాదీ ముబారక్ పథకం ఓ వరమని : ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. జిల్లాలోని పెంచికల్పేట్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణలక్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ సర్కార్ ఆదర్శమన్నారు.
పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దని సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ అనంత రాజ్, స్థానిక సర్పంచ్మేకల కమల ఆయా గ్రామాల సర్పంచులు ఉపాషి సంజీవ్, దుర్గం రాజన్న, మధునయ్య దేవాజీ, ఎంపీటీసీ రాజన్న, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చౌదరి తిరుపతి, మైనారిటీ శాఖ అధ్యక్షుడు ఖైరాత్, జాగృతి అధ్యక్షుడు నగునూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.