ముక్రా(కే)కు పురస్కారం
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) సర్పంచ్ గాడ్గె మీనాక్షికి గ్రామ ఉర్జ స్వరాజ్ విశేష్ పంచాయతీ పురస్కారం, రూ.50 లక్షల రివార్డును కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అందజేశారు. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు.
- ‘గ్రామ ఉర్జ స్వరాజ్ విశేష్ పంచాయతీ’ అవార్డు ప్రకటించిన కేంద్రం
- ఢిల్లీలో అవార్డు అందుకున్నసర్పంచ్ గాడ్గె మీనాక్షి
ఇచ్చోడ, ఏప్రిల్ 17: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) సర్పంచ్ గాడ్గె మీనాక్షికి గ్రామ ఉర్జ స్వరాజ్ విశేష్ పంచాయతీ పురస్కారం, రూ.50 లక్షల రివార్డును కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అందజేశారు. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. దేశంలో నానాజీ దేశ్ముఖ్ స్పెషల్ క్యాటగిరీలో ఈ పురస్కారానికి మూడు గ్రామా లు ఎంపిక కాగా, తెలంగాణ నుంచి ముక్రా(కే) ఒకటి మాత్రమే ఉంది. ఈ సందర్భంగా సర్పంచ్ గాడ్గె మీనాక్షి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాల వల్లే ఈ అవార్డు వచ్చిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామ స్వరూపం మార్చిందని తెలిపారు. సీఎం నాయకత్వంలో ముక్రా(కే) దేశంలోనే ఆదర్శం గా నిలుస్తున్నదని, అన్ని విభాగాల్లో అగ్రగామిగా నిలవడానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు, నిధులు, మార్గదర్శకాలు అందజేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ సహాయ మంత్రి కపిల్ పాటిల్, తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీపీవో శ్రీనివాస్, ఎంపీటీసీ గాడ్గె సుభాష్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

