బీఆర్ఎస్ హయాంలోనే ఖానాపూర్కు మహర్దశ
ఖానాపూర్ నియోజక వర్గం గడిచిన పదేళ్ల కాలంలో అత్యంత అభివృద్ధి సాధించింది. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే పరిపాలన పరంగా అనేక సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది.
కడెం, నవంబర్ 29 : ఖానాపూర్ నియోజక వర్గం గడిచిన పదేళ్ల కాలంలో అత్యంత అభివృద్ధి సాధించింది. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే పరిపాలన పరంగా అనేక సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది. ఆ దిశగా మరింత ముందుకు సాగాలని, భవిష్యత్లో మండలాలు, గ్రామాల అభివృద్ధికి కృషి చేయ నుంది. అయితే ఈ రెండు పర్యాయాల్లో బీఆర్ ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి అనేక అభివృద్ధి పనులు చేపట్టింది.
ఖానాపూర్
- మండలంలో రూ. 390 లక్షలతో సమీకృత మార్కెట్ నిర్మాణం చేపట్టారు. రూ3 కోట్లతో 5000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గోదాం నిర్మాణం.
- నూతన మున్సిపాలిటీ ఏర్పాటు, మున్సి పాలిటీ పరిధిలో సెంట్రల్ లైటింగ్, డివైడర్స్ నూతన డబుల్ రోడ్డు నిర్మాణం
- 400కు పైగా డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మా ణం.
- 50 లక్షలతో డంప్ యార్డ్, ఉద్యానవనం ఏర్పాటు.
కడెం
- మండలంలో రూ. 280 కోట్లతో మిషన్ భగీరథ ఏర్పాటు చేసి, ఐదు మండలాలకు నిత్యం తాగునీటి సరఫరా చేస్తున్నారు.
- కడెం మండలకేంద్రంలో 200 డబుల్ బె డ్రూం ఇండ్ల నిర్మాణం.
- రూ. 70 కోట్లతో బెల్లాల్ నుంచి బోర్నపల్లి వరకు గోదావరి మీదుగా వంతెన నిర్మాణం పూర్తి చేశారు.
- రూ. 2.74 కోట్లతో కడెంలో హరిత రిసార్ట్ నిర్మాణం చేపట్టారు. దీని ద్వారా పర్యాటకులకు మరింత సౌకర్యాలను మెరుగుపర్చారు.
దస్తురాబాద్
- మండలంలోని దేవునిగూడెంలో 80 హెక్టా ర్ల పరిధిలో లక్ష మొక్కల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఏపుగా మొక్కలను పెంచారు.
- నూతన మండలం కావడంతో కడెం మండ లంలోని పాండ్వాపూర్ నుంచి బుట్టాపూర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు.
- దస్తురాబాద్ నుంచి గొడిసెర్యాల వరకు 6.25 కోట్లతో తారు రోడ్డు నిర్మాణం.
- రూ. 3.54 లక్షలతో కేజీబీవీకి నూతన భవ న నిర్మాణం పూర్తి చేశారు.
పెంబి
- నూతన మండలమైన పెంబికి రూ. 3 కోట్ల తో కేజీబీవీ భవన నిర్మాణం.
- రావిగూడ, పస్పుల గ్రామాల్లో చెక్డ్యాంల నిర్మాణం.
- పెంబి నుంచి చెట్పెల్లి వరకు నూ. 2 కోట్ల తో తారురోడ్డు పనులు
- పెంబి నుంచి కొసగుట్ట వరకు రూ. కోటి 50లక్షలతో రోడ్డు నిర్మాణం.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

