జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి.. ఇంటింటికీ సంక్షేమంతో మార్పు
నిర్మల్ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరుతుండడంతో ఎన్నో కుటుంబాల్లో మార్పు కనపడుతున్నది.. మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత వాసులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుంది” అని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్‌లోని దివ్య గార్డెన్లో చైర్పర్సన్ విజయలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరు కాగా
- మెడికల్ కళాశాలతో మెరుగైన వైద్యం
- నిర్మల్ జడ్పీ సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
- ఎజెండాలోని 44 అంశాలపై సుదీర్ఘ చర్చ
- పలు సమస్యలపై ఆరా.. పరిష్కారానికి హామీ
- హాజరైన ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్
“నిర్మల్ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరుతుండడంతో ఎన్నో కుటుంబాల్లో మార్పు కనపడుతున్నది.. మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత వాసులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుంది” అని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్‌లోని దివ్య గార్డెన్లో చైర్పర్సన్ విజయలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరు కాగా, సభ్యులు సభ దృష్టికి తెచ్చిన సమస్యలను ఓపికగా విన్నారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కాగా, రెండున్నర గంటల పాటు ఎజెండాలోని 44 అంశాలపై చర్చించారు. ప్రజాప్రతినిధులు దృష్టికి తెచ్చిన సమస్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
నిర్మల్ టౌన్, అక్టోబర్ 21: నిర్మల్ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్లో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. మొత్తం 44 అంశాలతో కూడిన ఎజెండాపై సమావేశంలో సభ్యులు, అధికారుల సమక్షంలో చర్చించారు. నిర్మల్ జిల్లాలో ప్రభుత్వం ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువవడంతో మంచి పేరు వచ్చిందని పేర్కొన్నారు. నిర్మల్‌లో మెడికల్ కళాశాల ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందనుందని చెప్పారు. మెడికల్ కళాశాల కోసం రూ. 12 కోట్లతో కొత్త భవనం నిర్మిస్తున్నామని తెలిపారు. జిల్లాలో పనిచేసే అధికారులకు అక్రమ డిప్యూటేషన్లు వేయవద్దని కలెక్టర్‌కు సూచించారు. నిర్మల్ జిల్లాలో ఆర్టీసీ అధికారుల తీరు బాగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
సోన్ జడ్పీటీసీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయాలని కోరారు. నిర్మల్ ప్రైవేటు దవాఖానల్లో ఫీజులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారని , వాటిని అరికట్టాలని సారంగాపూర్ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి సమావేశం దృష్టికి తెచ్చారు. అర్హులైన వారందరికీ పింఛన్లు అందించాలని కుంటాల ఎంపీపీ అప్క గజ్జారాం, సోన్ మండలంలో పలు గ్రామాలకు నిధులు మంజూరు చేయాలని ఎంపీపీ మానస మంత్రిని కోరారు. మిషన్ భగీరథ ద్వారా నీటినందించాలని కడెం ప్రజాప్రతినిధులు అలెగ్జాండర్, శ్రీనివాస్‌రెడ్డి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సారంగాపూర్ పీహెచ్సీలో వైద్యుడిని నియమించాలని ఎంపీపీ మహిపాల్‌రెడ్డి కోరగా, భైంసాలో దవాఖానలో సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలని జడ్పీటీసీ దీప కోరారు. లక్ష్మణచాంద మండలంలో భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం వచ్చేలా చూడాలని విన్నవించారు. దిలావర్పూర్లో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని జడ్పీ కో అప్షన్ సభ్యుడు సుభాష్ రావు విజ్ఞప్తి చేశారు. జడ్పీ వైస్ చైర్పర్సన్ సాగరబాయి మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, డీఎఫ్‌వో అరవింద్, అధికారులు విజయలక్ష్మి, ధన్‌రాజ్, చౌహాన్, శ్రీనివాస్‌రెడ్డి, మల్లికార్జున్, నర్సింహారెడ్డి, రవీందర్‌రెడ్డి, శంకర్, శ్రీకళ, సుధారాణి, శ్రీనివాస్‌బాబు, అశోక్, శంకరయ్య, వెంకటేశ్వర్రావు, తదితరులు పాల్గొన్నారు.
కోరం లేక జడ్పీ సమావేశం వాయిదా
ఎదులాపురం,అక్టోబర్21: ఆదిలాబాద్ జడ్పీ సర్వ సభ్య సమావేశం కోరం లేక వాయిదా వేస్తున్నట్లు జడ్పీ చైర్మన్ జనార్దన్‌రాథోడ్ ప్రకటించారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి 11.30 గంటల వరకు కోరం సభ్యులు హాజరుకాలేదు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. తర్వలోనే మళ్లీ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. జడ్పీ సీఈవో గణపతి, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కెరావు, జడ్పీటీసీలు గోక గణేశ్ రెడ్డి, బ్రహ్మనంద్, కుమ్ర సుధాకర్, మల్లెపూల నర్సయ్య, పుష్పలత, ఆదిలాబాద్ ఎంపీపీ గండ్రత్ రమేశ్, అధికారులు హాజరయ్యారు.
వైఖరి మార్చుకోవాలి
నిర్మల్ జిల్లాలో ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, కొందరు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించడం లేదు. అటువంటి అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలి. ఇటీవల కురిసిన వర్షాలకు కడెం, ఖానాపూర్, పెంబి, దస్తురాబాద్ మండలాల్లో నష్టపోయిన రైతులను ఆదుకుంటున్నాం. కవ్వాల్ అభయారణ్యంలో పునరావాస ప్రక్రియకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– రేఖానాయక్, ఖానాపూర్ ఎమ్మెల్యే
అధికారులు బాధ్యతగా పని చేయాలి..
జిల్లాలో పనిచేసే అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలి. ప్రజలకు మంచి పరిపాలన అందించేందుకు కృషి చేయాలి. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కృషితో నిర్మల్ జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది.
– విజయలక్ష్మి, జడ్పీ చైర్పర్సన్
సబ్స్టేషన్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టండి..
భైంసా నియోజక వర్గంలో పెండింగ్‌లో ఉన్న సబ్స్టేషన్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలి. నియోజకవర్గంలో మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికీ తాగునీటిని ఇచ్చేందుకు ప్రభుత్వం పథకాన్ని రూపొందిస్తే కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో గ్రామాల్లో లీకేజీలు ఏర్పడుతున్నాయి. దీనిని వెంటనే సరిదిద్దాలి.
– విఠల్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

