నాటుకోడికి భలే క్రేజ్
వేడి వేడిగా నాటుకోడి కూర.. ఇళ్లంతా గుమగుమలు.. మసాల వాసన ఊహించు కుంటేనే నోరూరుతున్నది కదా... అదే మరి నాటు కోడికి భలే క్రేజ్ పెరిగింది. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా ప్రజలు నాటు కోడి కూరను ఎక్కువగా ఇష్టపడు తున్నారు.
- పట్టణాలు, పల్లెల్లో జోరుగా నాటు కోళ్ల విక్రయం
- ధర కాస్త ఎక్కువైనా మార్కెట్లో డిమాండ్
- శుభకార్యాల్లో కోడి కూర ప్రత్యేకం
- ఆసక్తి చూపుతున్న ప్రజలు
వేడి వేడిగా నాటుకోడి కూర.. ఇళ్లంతా గుమగుమలు.. మసాల వాసన ఊహించు కుంటేనే నోరూరుతున్నది కదా… అదే మరి నాటు కోడికి భలే క్రేజ్ పెరిగింది. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా ప్రజలు నాటు కోడి కూరను ఎక్కువగా ఇష్టపడు తున్నారు. కొవిడ్ తర్వాత ప్రతి ఒక్కరూ పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకుం టున్నారు. నాన్‌వెజ్‌కు ప్రియారిటీ ఇస్తున్నారు. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి కాస్తంత డబ్బులు ఎక్కువైనా ఖర్చుకు వెనుకాడడం లేదు. దీంతో నాటు కోడి, మాంసం విక్రయాలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. పల్లెల్లో సహజ సిద్ధంగా పెరిగిన కోడి కూర తినడానికి ఇష్టపడుతున్నారు.
చికెట్ సెంటర్లలోనూ విక్రయం ..
చికెన్ సెంటర్లలోనూ నాటుకోళ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. చికెన్ షాపు నిర్వాహ కులు నాటు కోళ్లను డ్రెస్సింగ్ చేసి ఇస్తున్నారు. నాటు కోడి మాంసంలో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. నాటు కోళ్లు ప్రకృతిలో సహజ సిద్ధంగా పెరుగుతాయి. వీటి పెంపకానికి ఎలాంటి మందులు అవసరం లేదు. మాంసం గట్టిగా, రుచిగా ఉంటుంది. త్వరగా జీర్ణమవుతుంది. మటన్‌తో పోలిస్తే వీటి ధర తక్కువ కావడం, పోషకాలు ఎక్కువగా ఉండడం కారణం. మాంసం ప్రియులు ఎక్కు వగా నాటుకోళ్లు తినడానికి ఇష్టపడుతున్నారు.
శుభకార్యాల్లోనూ ప్రత్యేకం..
శుభకార్యాల్లో ప్రత్యేకమైన వంటగా కొందరు నాటు కోడి కూర పెడుతున్నారు. బంధువులు, స్నేహితులు, సన్నిహితులకు రుచికరమైన మాంసాహారం అందించేందుకు ఇష్టపడుతు న్నారు. బాయిలర్ కోడి ధర ప్రస్తుత మార్కెట్లో కిలో రూ. 200 నుంచి 250 వరకు ఉంది. నాటు కోడి కిలో తక్కువలో తక్కువ రూ. 350 వరకు పలుకుతుంది. ఈ ధర కొన్ని సార్లు రూ. 450 నుంచి రూ. 500 వరకు పలుకుతుంది. అయినా మార్కెట్లో నాటుకోడికి ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు.
పల్లెటూరి నుంచి పట్టణాలకు తరలింపు
పల్లెల్లో పెంచుతున్న నాటుకోళ్లను కొందరు వ్యాపారులు ద్విచక్రవాహనంపై వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో కోడికి రూ. 200ల నుంచి 300 వరకు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తు న్నారు. అంతేకాకుండా చికెన్ దుకాణాల్లో ఒక్కో కోడిని కిలోకు రూ. 350 నుంచి 450 వరకు విక్రయిస్తున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

