అంతర్గత బదిలీల్లో రాజకీయం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ ఆలయంలో ఇటీవల అంతర్గత బదిలీలు జరిగాయి. ఆలయ ఈవో విజయరామారావు రాజకీయ ఒత్తిళ్లతోనే అంతర్గత బదిలీలు చేశారని విశ్వనీయ సమాచారం. తమకు అనుకూలమైన వారికి మంచి చోటుకు బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
- చక్రం తిప్పుతున్న బాసర ఆలయ ఏఈవో
- ఇటీవల పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు ఫిర్యాదు
బాసర, ఏప్రిల్ 30 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ ఆలయంలో ఇటీవల అంతర్గత బదిలీలు జరిగాయి. ఆలయ ఈవో విజయరామారావు రాజకీయ ఒత్తిళ్లతోనే అంతర్గత బదిలీలు చేశారని విశ్వనీయ సమాచారం. తమకు అనుకూలమైన వారికి మంచి చోటుకు బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ బదిలీల్లో కొందరు రాజకీయ నాయకులకు ముడుపులు ముట్టాయని సమాచారం. ఆలయంలో ఏఈవో కీలక పాత్ర పోషిస్తూ కొన్ని విభాగాల నుంచి రోజువారీగా ముడుపులు ముట్ట జెప్తున్నారు. గదుల విచారణ, వీఐపీ దర్శనాల విభాగం, లడ్డూ స్టోర్ నుంచి పెద్ద ఎత్తున గోల్మాల్ చేస్తూ రోజువారీగా సదరు ఏఈవో కనుసైగల్లో నడిపిస్తున్నారు. ఇటీవల దేవాదాయశాఖ విజిలెన్స్ అధికారిణి కృష్ణవేణి రికార్డులను పరిశీలించినప్పుడు పెద్ద ఎత్తున స్టాక్ లేక పోవడంతో సదరు అధికారిణి కంగుతిని నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్‌తోపాటు ప్రభుత్వానికి అందజేశారు. అయితే కొందరిని సస్పెండ్ చేయాలంటూ కమిషనర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ తమ పలుకుబడితో రాజకీయ నాయకులకు ముడుపులు ముట్టజెప్పి ఆపుకున్నారు.
మంత్రి సీతక్కకు ఫిర్యాదు
ఈ విషయంపై బాసరను సందర్శించిన మంత్రి సీతక్కకు అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ ఈవో విజయరామారావు, ఏఈవోతోపాటు ఇద్దరు సిబ్బందికి చార్జీ మెమోలను జారీ చేశారు. ఇటీవల ఆలయంలో లడ్డూ స్టోర్‌లో జరిగిన ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
ఏఈవో ట్రాన్స్ఫర్ ఎలా ఆగింది?
బాసర ఆలయంలో పని చేస్తున్న సుదర్శన్‌గౌడ్ 2020 లో బాసర ఆలయానికి డిప్యూటేషన్‌పై వచ్చాడు. ఈయనపై కొమురవెళ్లిలో పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆయనను కొమురవెల్లి నుంచి బాసరకు డిప్యూటేషన్‌పై పంపించారు. ఇక్కడ కూడా అవినీతి పనులు చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. అతని అవినీతి ఎక్కడ బయటకు వస్తాయోనని గత నెలలో ట్రా న్స్‌ఫర్ చేయాలంటూ కమిషనర్‌కు వినతి పెట్టుకున్నాడు. కాగా.. కొమురవెళ్లిలోని ఓ కాంగ్రెస్ నాయకుడు ఆ అధికారి మా కొద్దు అంటూ కమిషనర్‌కు తెలుపడంతో ఆయన ట్రాన్స్ఫర్ను రద్దు చేశారు. డిప్యూటేషన్‌పై వచ్చి ఇంత కాలంగా ఇక్కడే పని చేయడం, అంతకు ముందు పని చేసిన కొమురవెళ్లి, ఇప్పుడు పని చేస్తున్న బాసర అమ్మవారి ఆలయంలో అవినీతి, అక్రమాలు చేస్తున్నారనే గ్రామస్తులు ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదంతా కూడా ఏవోకు తెలియకుండానే జరుగుతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

