ఎన్నికలు విధులు పకడ్బందీగా నిర్వహించాలి
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
- కలెక్టర్ బదావత్ సంతోష్
మంచిర్యాల ఏసీసీ, ఫిబ్రవరి 16: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్లో సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతీలాల్తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయ సిబ్బందితో ఎన్నికల విధులు నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల విధుల్లో ఎలాంటి పొరపాట్లకు లేకుండా చూడాలని సూచించారు. ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్, వెబ్ కాస్టింగ్ ఇతర వివిధ విభాగాల్లో అధికారులకు విధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఏమైనా సందేహాలుంటే ఉన్నతాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.
ఎన్నికల నియమ, నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఐటీ సంబంధిత అంశాలపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అలసత్వం చేస్తే భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

