నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
రేషన్ డీలర్లు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని రెబ్బెన సీఐ చిట్టిబాబు హెచ్చరించారు. రెబ్బెన మండలంలోని రేషన్ షాప్-4, రేషన్ షాప్-22లను ఆదివారం పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేశారు.
రెబ్బెన, జూన్ 2 : రేషన్ డీలర్లు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని రెబ్బెన సీఐ చిట్టిబాబు హెచ్చరించారు. రెబ్బెన మండలంలోని రేషన్ షాప్-4, రేషన్ షాప్-22లను ఆదివారం పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేశారు. లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు బియ్యం కొని నిల్వ ఉంచుతున్నారన్న సమాచారం మేరకు వడ్డేపల్లి రాజమణి,శ్రీపతికి చెందిన రేషన్ షాప్-4ను తనిఖీ చేయగా,
స్టాక్కంటే అదనంగా 9 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అలాగే శంకర్లాల్జైస్వాల్, సంతోశ్జైస్వాల్కు చెందిన రేషన్ షాప్-22ను తనిఖీ చేయగా స్టాక్ కంటే అదనంగా సుమరు 11 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అదనంగా ఉన్న బియ్యం సీజ్ చేసి, వారిపై కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో రెబ్బెన ఎస్ఐ చంద్రశేఖర్, ఎన్ఫోర్స్మెంట్ డీటీలు రాజ్‌కుమార్, శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

