ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, ఫిబ్రవరి 28: ఆసిఫాబాద్ కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవ్ రావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త కలెక్టర్గా స్నేహ శబరీష్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2017 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన స్నేహ శబరీష్ ప్రస్తుతం జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా పని చేస్తున్నారు. ఇక కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకోనున్నారు.
ఆసిఫాబాద్ డీపీవోగా భిక్షపతిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బెల్లంపల్లి డీఎల్పీవోగా పని చేస్తున్న ఆయనను ఆసిఫాబాద్ జిల్లా పంచాయతీ అధికారిగా నియమించింది. ఆసిఫాబాద్ డీఎల్పీవో ఉమర్ హుస్సేన్ ఇన్చార్జి డీపీవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక పూర్తిస్థాయి డీపీవోగా భిక్షపతి బాధ్యతలు తీసుకోనున్నారు.