జోష్ నింపిన కేటీఆర్ టూర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం చెన్నూర్ పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ కాగా, శ్రేణుల్లో జోష్ కనిపిస్తున్నది. కేటీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా 12.10 గంటలకు చెన్నూర్‌లోని మీని స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు.
- చెన్నూర్ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో శ్రేణుల్లో ఫుల్ ఖుషీ
చెన్నూర్/కోటపల్లి, మే 11 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం చెన్నూర్ పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ కాగా, శ్రేణుల్లో జోష్ కనిపిస్తున్నది. కేటీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా 12.10 గంటలకు చెన్నూర్‌లోని మీని స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు.
అక్కడి నుంచి పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకొని పూల మాల వేశారు. అనంతరం 12.33 గంటలకు సభాస్థలికి చేరుకున్నారు. 1.09 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించి, 1.31 గంటలకు ముగించారు. ఆపై దళిత సోదరుడు, బీఆర్ఎస్ కార్యకర్త ఎనగందుల ప్రశాంత్ ఇంటికెళ్లి మధ్యాహ్నం భోజనం చేశారు. ఆ తర్వాత హెలికాప్టర్లో తిరుగు పయనమయ్యారు.
ఎండను సైతం లెక్క చేయక..
ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాదిగా ప్రజలు, సింగరేణి కార్మికులు తరలివచ్చారు. సభలో కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు ప్రజలు ఈలలు, చప్పట్లతో మారుమోగించారు. ఆయన ప్రసంగం ఆకట్టుకున్నది. కేసీఆర్ ఉన్నప్పుడే ప్రభుత్వం బాగుండే అనే వారు చేతులు లేపండి అంటే.. సభలో ఉన్నవారంతా చేతులు లేపారు.
కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ బీఆర్ఎస్ నాయకులు భారీ ఫ్లెక్సీలు, కౌటౌట్లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

