ఆశీర్వదిస్తే సమస్యలపై పోరాడుతా
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారిందని, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పెద్దపల్లి బీఆర్ఎప్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
- అవసరం కోసం పార్టీలు మారే గడ్డం ఫ్యామిలీకి బుద్ధి చెప్పండి
- బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
కోటపల్లి, మే 11 : కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారిందని, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పెద్దపల్లి బీఆర్ఎప్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం చెన్నూర్ పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.
ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్క హామీని అమలు చేయలేక చేతులెత్తేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం మారితే పాలన మెరుగుపడాలి గాని.. మరుగున పడిపోతున్నదన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిడికిలి బిగించి ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని, పార్లమెంట్ ఎన్నికలే ఇందుకు పునాది కావాలన్నారు. సింగరేణి కార్మికుడిగా సాధారణ జీవితం ప్రారంభించిన తనకు ఈ ప్రాంతంపై గట్టి పట్టుందని, ప్రజలు ఎంపీగా ఆశీర్వదిస్తే సింగరేణి కార్మికులు, ప్రజల సమస్యలపై పార్లమెంట్లో పోరాడుతానని తెలిపారు. ఆస్తుల రక్షణ కోసం వచ్చే నాయకులను నమ్మొద్దని, అవసరం కోసం పార్టీలు మారే గడ్డం ఫ్యామిలీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

