కాంగ్రెస్ నాయకుల అక్రమ వసూళ్లు
సిర్పూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మె ల్యే కోనేరు కోనప్పలు మీ పేరు చెప్పుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు మంత్రి సీతక్కకు గురువారం సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్‌బాబు రాసిన బహిరంగ లేక సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది.
- మంత్రి సీతక్కకు బహిరంగ లేఖ రాసిన బీజేపి ఎమ్మెల్యే హరీశ్ బాబు
బెజ్జూర్, ఏప్రిల్ 18 : సిర్పూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మె ల్యే కోనేరు కోనప్పలు మీ పేరు చెప్పుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు మంత్రి సీతక్కకు గురువారం సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్‌బాబు రాసిన బహిరంగ లేక సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది. ఇందులో కాంగ్రెస్ నాయకులు అధికారి పార్టీ పేరు, మీ పేరు చెప్పుకుంటూ వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇది పార్టీతోపాటు మీకు అప్రతిష్ట తెచ్చి పెడుతుందని ఆ లెటర్లో పేర్కొన్నారు. ఇది వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ ఎమ్మెల్యే లేఖపై కాంగ్రెస్ నాయకుల ఖండన
మంత్రి సీతక్కకు బీజేపీ ఎమ్మెల్యే హరీశ్‌బాబు రాసిన బహిరంగ లేఖను గురువారం కాంగ్రెస్ నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్ధన్ నాయకులతో కలిసి బెజ్జూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనప్ప, కాంగ్రెస్ నాయకుడు రావి శ్రీనివాస్‌పై అసత్య ఆరోపణలు చేస్తే సహించం.
హరీశ్‌బాబు తండ్రి పురుషోత్తం రావు, తల్లి రాజ్యలక్ష్మీ హయాంలో పీడీఎస్ బియ్యం మహారాష్ట్రకు సరఫరా చేసిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యుడు బషారత్ ఖాన్, ఎంపీటీసీ గురిజాల వెంకటన్న, నాయకులు జావీద్ అలీఖాన్, అబ్దుల్ హకీం, బూస శంకర్, పుల్లూరి సతీశ్, నరేందర్‌గౌడ్, తంగెడిపల్లి మహేశ్, సిడం సకారాం పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

