తెలంగాణ రాక ముందు పొలం కాడ బావి ముందు కరెంట్ కోసం కావలి ఉండేటోళ్లం. ఎప్పుడు వస్తుండెనో.. ఎప్పుడు పోతుండెనో తెల్వక పోయేది. మళ్లీ గసోంటి పరిస్థితులు రావద్దు. ఎకరం పొలం పారడానికి ఎన్ని గంటల కరెంట్ కావాల్నో ఎవుసం చేసేటోళ్లకు తెలుస్తది. కానీ.. రేవంత్‌రెడ్డికి ఏం తెలుసు. కేసీఆర్ సారు సీఎం అయినంక కరెంట్ మంచిగ ఉంటంది. గప్పటిలెక్క ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతలేవు. ఒకవేళ కాలిపోయినా వెంటనే తెచ్చి పెడుతున్నారు.
– పడిగెల చంద్రయ్య, రైతు, పాత తర్లపాడు.