తాండూర్ : బక్రీద్ పండుగ వేడుకలను ( Bakrid Celebrations ) మండలంలోని ముస్లిం సోదరులు గురువారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తాండూరు ( Tandur ) , తంగళ్లపల్లి, ఐబీ మజీదుల ఆధ్వర్యంలో ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. నాయకులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు ఒకరికొకరు సోదరభావంతో శుభాకాంక్షలు తెలుపుకుని ఆత్మీయతను చాటుకున్నారు. అనంతరం పెద్దల సమాదుల వద్దకు వెళ్లి నివాళులర్పించారు.
ఎంఏ సంస్థ ఆధ్వర్యంలో మంచినీళ్ల సౌకర్యం కల్పించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తాండూరు సీఐ దేవయ్య ఆధ్వర్యంలో మసీదులు, కబ్రస్థాన్ల వద్ద తాండూర్ ఎస్సై కే ప్రసాద్, పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.