ట్రిపుల్ఐటీ ప్రవేశాల జాబితా విడుదల
బాసర ట్రిపుల్ఐటీ కళాశాలలో 2023-24 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాల ఎంపిక జాబితా విడుదలైంది. మొత్తం 1500 సీట్లకు గాను 13538 దరఖాస్తులు రాగా... 1404 సీట్ల జాబితాను ట్రిపుల్ఐటీ ఇన్చార్జి వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్ కుమార్ సోమవారం విడుదల చేశారు.
- 1,404 మంది విద్యార్థుల ఎంపిక
బాసర, జూలై 3 : బాసర ట్రిపుల్ఐటీ కళాశాలలో 2023-24 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాల ఎంపిక జాబితా విడుదలైంది. మొత్తం 1500 సీట్లకు గాను 13538 దరఖాస్తులు రాగా… 1404 సీట్ల జాబితాను ట్రిపుల్ఐటీ ఇన్చార్జి వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్ కుమార్ సోమవారం విడుదల చేశారు. మిగిలిన 96 సీట్లకు గాను కౌన్సెలింగ్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలను కూడా ప్రకటించారు. సీట్లు పొందిన వారిలో ఈ ఏడాది కూడా బాలికలే అధిక శాతం ఉన్నారు.
కౌన్సెలింగ్ తేదీలు
1404 సీట్లలో క్రమ సంఖ్య 1 నుంచి 500 ల వరకు ఈనెల 7న , 501 నుంచి 1000 వరకు 8న, 1001 నుంచి 1404 వరకు 9న కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే పీహెచ్, స్పోర్ట్స్ కోటాలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈనెల 14న, ఎన్సీసీ, క్యాప్ కేటగిరీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఈనెల 15న నిర్వహించనున్నారు.
జిల్లాల వారీగా సాధించిన సీట్లు..
1404 సీట్లకు గాను జిల్లాల వారీగా సాధించిన సీట్లు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా నుంచి 322, సంగారెడ్డి జిల్లా నుంచి 178, కామారెడ్డి జిల్లా నుంచి 93, నిర్మల్ జిల్లా నుంచి 92, మెదక్ జిల్లా నుంచి 78, కరీంగన్ జిల్లా నుంచి 71, నిజామాబాద్ జిల్లా నుంచి 68, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 57, రంగారెడ్డి జిల్లా నుంచి 46, ఖమ్మం జిల్లా నుంచి 41, మహబూబాబాద్ జిల్లా నుంచి 31, ఆదిలాబాద్ జిల్లా నుంచి 29, నల్గొండ జిల్లా నుంచి 27, జగిత్యాల జిల్లా నుంచి 25, జనగాం జిల్లా నుంచి 25, మంచిర్యాల జిల్లా నుంచి 24, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి 22, మేడ్చల్ జిల్లా నుంచి 20, యాదాద్రి జిల్లా నుంచి 18, హైదరాబాద్ జిల్లా నుంచి 17, జయశంకర్ జిల్లా నుంచి 14, పెద్దపల్లి జిల్లా నుంచి 14, సూర్యాపేట జిల్లా నుంచి 14, వరంగల్ రూర్బన్ జిల్లా నుంచి 14, నాగర్కర్నూల్ జిల్లా నుంచి 12, భద్రాద్రి జిల్లా నుంచి 9, వనపర్తి జిల్లా నుంచి 9, మహబూబ్నగర్ జిల్లా నుంచి 7, ములుగు జిల్లా నుంచి 7, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి 4, జోగులాంబ గద్వాల జిల్లా నుంచి 2, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఓపెన్ కేటగిరీలో నెల్లూరు జిల్లా నుంచి 3, కర్నూలు జిల్లా నుంచి 2, శ్రీకాకుళం జిల్లా నుంచి 2, విశాఖ పట్నం జిల్లా నుంచి 2, అనంతపురం, కడప, కృష్ణ, ప్రకాశం, వెష్ట్గోదావరి జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఎంపికయ్యారు.
కేటగిరీల వారీగా కటాఫ్
ట్రిపుల్ఐటీలో ఎంపికైన విద్యార్థులు కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు ఇలా ఉన్నాయి. ఓసీ కేటగిరిలో 10.2, ఈడబ్ల్యూస్లో 9.9, బీసీ-ఏ లో 10.1, బీసీ-బీ లో 10.1, బీసీ-సీలో 9.3, బీసీ-డీ లో 10.1, బీసీ-ఈ లో 9.9, ఎస్సీలో 10, ఎస్టీ లో 9.9. కార్యక్రమంలో అడ్మిషన్ కోఆర్డినేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

